Read more!

English | Telugu

నవదీప్ కాలికి గాయం...ఆట పట్టించిన తేజస్వి


మూవీ షూటింగ్స్ అంటే చాలు గాయాలు అవడం కామన్. బిచ్చగాడు 2 షూటింగ్ టైంలో విజయ్ ఆంటోనీకి, అలాగే తన న్యూ మూవీ షూటింగ్లో  వరుణ్ సందేశ్ కి రీసెంట్ గాయాలయ్యాయి. ఇంకా  నటి రేణు దేశాయ్ కాలికి కూడా దెబ్బ తగిలి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో ఫేమస్ యాక్టర్ పిల్లి కళ్ళ హీరో నవదీప్ కూడా గాయాలపాలయ్యాడు.  అయితే ఎలా జరిగిందో తెలియదు కానీ.. అతడిని చూసేందుకు వెళ్లిన నటి తేజశ్వి మదివాడ.. నవదీప్‌ను ఫుల్ గా ఆట పట్టించేసింది. "నీ సుఖమే నే కోరుకున్న" అనే సాంగ్ కి  డాన్స్ చేస్తూ ఆ వీడియోని  సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నవదీప్ కాలికి గాయమైన విషయం తెలిసింది. ‘నీ సుఖమే నే కోరుతున్నా, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు’కాదంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టేసింది. అందులో నవదీప్ ఎడమ కాలికి ఫ్యాక్చర్ కనిపిస్తుంది. అలాగే చేతిలో హ్యాండ్ స్టిక్ కూడా ఉంది.  

తేజశ్వి ఆటపట్టిస్తుంటే ఒక  మూలన సోఫాలో కూర్చుని అలా దీర్ఘంగా ఆమె అల్లరిని చూస్తూ ఉండిపోయాడు మన హీరో. ఇంతకు నవదీప్ కి  ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. అయితే ఈ వీడియో చూసి కొంత మంది ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది త్వరగా కోలుకోవాలని విషెస్ మెసేజెస్ పెట్టారు.  నవదీప్ జై మూవీతో  హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చందమామ మూవీతో  మంచి హీరోగా ముద్ర వేయించుకున్నాడు. తర్వాతర్వాత మంచి మూవీస్ పడకపోయేసరికిక్  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. విలన్ రోల్స్ లో కనిపించాడు. నేనే రాజు, నేనే మంత్రి, ధ్రువ మూవీస్ లో మంచి రోల్స్ లో నటించాడు నవదీప్.  బిగ్ బాస్‌లోనూ పార్టిసిపేట్ చేసాడు. ప్రస్తుతం ఓటీటీ మూవీస్ లో నటిస్తున్నాడు.  నవదీప్, తేజశ్వి ఐస్ క్రీమ్ అనే మూవీలో కలిసి నటించారు. అలా అప్పటి నుండి వీళ్ళు  మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.. నవదీప్ రీసెంట్‌గా ‘న్యూసెన్స్’ అనే  వెబ్ సిరీస్‌తో, తేజస్విని ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి మార్క్స్ నే సంపాదించుకున్నారు.