English | Telugu

ఆది డబుల్ మీనింగ్ డైలాగ్...ఛి అన్న దీపికా పిల్లి

షో ఏదైనా కావొచ్చు కానీ అందులో ఎంటర్టైన్మెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం చాలా కామన్. ప్రతీ వారం ఏదో ఒక ఎపిసోడ్ లో ఏదో ఒకటి ఇలానే డైలాగ్స్ బాగా పేలతా ఉంటాయి...వైరల్ కూడా అవుతూ ఉంటాయి. అందులోనూ ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడంలో బుల్లితెర మీద హైపర్ ఆదికి మించిన వాళ్ళు లేరు. ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. రావడం రావడమే వాల్తేర్ వారియర్స్ తమ సత్తా చూపించారు.

చంద్రముఖి గెటప్‌లో చంద్రకళ సాంగ్ కి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. "మీ వైజాగ్ పవర్ చూపించేసారు" అని ఈ టీమ్ కి శేఖర్ మాష్టర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ మూవీలోని ‘కిళ్లీ కిళ్లీ నమిలాక’ అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు ఆది, దీపిక పిల్లి. లుంగీ కట్టుకుని తన స్టైల్లో స్టెప్పులేశాడు ఆది. ‘వన్స్ మనం ఫిక్సయ్యాక పిల్లైనా , కిళ్లీ అయినా నమిలెయ్యడమే’ అనగానే.. దీపిక ‘ఛీ’ అంటూ రియాక్ట్ అయింది. ఇక దీపికా పిల్లికి తండ్రిగా చమ్మక్ చంద్ర వస్తూనే మెగాస్టార్ మూవీ ‘రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆదిని అంకుల్ అంటూ చంద్ర అనడం...చంద్ర ఎప్పటిలానే ‘రాములా’ అంటూ నవ్వించడం మంచి ఫన్ క్రియేట్ చేసింది. "అరటి పండు తొక్క" గిఫ్ట్ ఇచ్చాడంటూ ఒక టాపిక్ వచ్చింది. "మా అమ్మాయికి కూడా ఇదే తొక్క వేసావా" అని అడిగేసరికి దీపికనే తొక్క ఆనాడు ఆది దానికి ఆమె ‘ఏయ్’ అంటూ అరిచింది. "మీ అమ్మాయికి టెంట్ వేసా ఇంకా స్టెంట్ ఉంది" అని ఆది అనేసరికి ‘ఛీ ఛీ’ అంటూ రియాక్ట్ అయ్యింది దీపికా. జడ్జెస్ మార్క్స్ ఇవ్వడానికి రెడీ అవుతూ.. కంటెస్టెంట్లను సస్పెన్స్‌లో పెట్టేసారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.