English | Telugu

నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు..వెళ్ళిపోతాను అని ఏడుస్తూ వెళ్లిపోయిన సత్య 

"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సునయన, సత్యశ్రీ, రాకింగ్ రాకేష్ వచ్చారు. "మనలో మన మాట ఓవరాల్ గా ఎన్ని సినిమాలు చేసావ్" అని సునయనని అడిగారు. "20 , 25 ప్లస్ చేసాను" అని చెప్పారామె. "హీరోయిన్ గా ఎవరైనా అడిగారా" అని అలీ అడిగేసరికి "ఒక నిజం ఒక అబద్దం చెప్తా..అడిగారు ..కథలు అవీ నచ్చకపోవడం వలన చాల బిజీగా ఉండి" అని సునయన చెప్పేసరికి "నాకు తెలిసిన మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారు" అని ఆలీ అనేసరికి ఆమె నవ్వేశారు. తర్వాత రాకేష్ వచ్చారు.."మీ ఇద్దరిలో తెలివిగల ఎవరు" అని అడిగేసరికి "ఆవిడే " అన్నాడు. "అలా చెప్పమందా" అనేసరికి "అలాగే చెప్పాలి ఎందుకంటే ఎదురుగా ఉన్నారు కదా" అన్నాడు రాకేష్.

"సునయన తెలుసుగా నీకు" అని ఆలీ అడగడంతో "నా చిన్నప్పటి నుంచే కాదు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తోంది" అన్నాడు రాకేష్. తరువాత సత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. "నీ డ్రెస్ పేరేమిటి..లుంగీ డాన్స్ ఆ" అని అడిగేసరికి నవ్వేసింది సత్య. ఇక ఈ ఎపిసోడ్ లో కూడా హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు దొర్లేశాయి. "ఓపెన్ చేయగానే, ఎత్తగానే" అని రాకింగ్ రాకేష్ అనేసరికి అందరూ షాకైపోయారు. ఇక ఆలీ కూడా ఆ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి వంత పాడారు. ఇక సునయన తన స్టోరీ పేరు "నీ తిమింగళంలో నా సముద్రం" అని చెప్పేసరికి ఆలీ ఇచ్చిన లుక్ కి రాకేష్ గట్టిగా నవ్వేశారు. ఏమయ్యిందో ఏమో కానీ సత్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుని "నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు..వెళ్ళిపోతాను" అని ఏడుస్తూ స్టేజి మీద నుంచి వెళ్ళిపోయింది..

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.