English | Telugu

టేస్టీ తేజ బంఢారం బయటపడింది.. బిగ్ బాస్ కి రూల్స్ చెప్పిన రతిక రోజ్!

బిగ్ బాస్ సీజన్-7 అంతకంతకు ఆసక్తిని పెంచుతుంది. వచ్చీ రాగానే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్ బాస్.‌. కంటెస్టెంట్ నామినేట్ చేసే ఇద్దరిని వేరే గదిలోకి పిలిచి చూపిస్తుంటే వాళ్ళు అసూయతో, కోపంతో రగిలి పోతున్నారు. ఇక ఒక కంటెస్టెంట్ తమ నామినేషన్ చెప్పేసి బయటకు రాగానే నామినేషన్ చేసిన వాళ్ళతో హీటెడ్ కన్వర్సేషన్స్ జరుగుతున్నాయి.

ఇక హౌజ్ లోకి వెళ్ళగానే బ్యాచ్ లు స్టార్ట్ అయ్యాయి. ప్రియాంక జైన్ , అమర్ దీప్ ఒక జట్టుగా కూర్చొని మాట్లాడుకుంటే.. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ ఒక జట్టుగా, టేస్టీ తేజ, శివాజీ మరో జట్టుగా ఇలా ఒక్కొక్కరి గేమ్ ఒక్కోలా ఆడుతున్నారు. ఆయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో.. గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేసింది శోభాశెట్టి. రతికని, ప్రిన్స్ యావర్ ని ఆట సందీప్ నామినేట్ చేశాడు. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది దామిణి. కిచెన్ లో తనేం సహాయం చేయలేదని రతికని నామినేట్ చేసింది దామిణి. 'డిన్నర్ అయ్యాక ప్లేట్ కడగలేదు. మొత్తం హౌజ్ లో రతిక తర్వాత కిచెన్ లో‌ హెల్ప్ చేయలేనిది శోభా శెట్టే అని వారిద్దరిని నామినేట్ చేసింది దామిణి. అందరూ ఏదో ఇక హెల్ప్ చేస్తున్నారని, వీళ్ళ దగ్గర నుండి హెల్ప్ తక్కువ వచ్చిందని అందుకే అనర్హులని దామిణి అంది. అయితే బయటకొచ్చాక దామిణికి వివరణ ఇచ్చింది శోభాశెట్టి. "మార్నింగ్ నుండి నేనే గిన్నెలు కడిగాను. అన్ని పనులు చేశాను" అని దామిణితో శోభాశెట్టి అంది. అయితే తనకేం కనపడలేదని, ఇది నా ఇష్టమని దామిణి అంది. ఇక చేసేదేమీ లేక బయటకెళ్ళి ఏడ్చేసింది శోభాశెట్టి. టేస్టీ తేజ, షకీల వచ్చి శోభా శెట్టిని ఓదార్చరు.

షకీలా, గౌతమ్ కృష్ణని యావర్ నామినేట్ చేశాడు. 'నీ ఫాదర్ కింగా' అని షకీలా మేడమ్ అంది. ఆమె అలా అన్న ఆ టోన్ నాకు నచ్చలేదని అందుకే తనని నామినేట్ చేశానని ప్రిన్స్ యావర్ అన్నాడు‌. బాడీ ఎక్స్ పోజ్ చేస్తూ, షో ఆఫ్ చేస్తున్నాడని తేజతో గౌతమ్ కృష్ణ చెప్పాడంట, నా వల్ల ఏం అయిన ప్రాబ్లమ్ అయితే నాకే చెప్పాలి కానీ తేజకి ఎందుకు చెప్పాడని అందుకే గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు ప్రిన్స్ యావర్‌. అయితే బయటకొచ్చాక గౌతమ్ కృష్ణ అందరి ముందు మాట్లాడాడు. 'నేను అలా అనలేదు. టేస్టీ తేజనే నాతో నీ గురించి ఇలా అన్నాడు' అని గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ ని గౌతమ్ కృష్ణ అడుగగా.. నేనేం అనలేదని ప్రిన్స్ యావర్ అన్నాడు. ఇక దాంతో టేస్టీ తేజ తన గేమ్, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడని అందరికి తెలిసింది.

రతిక, ప్రిన్స్ యావర్ ని నామినేట్ చేశాడు ఆట సందీప్. షూస్ ఆమెవి నీట్ గా పెట్టుకోలేదని రతికని నామినేట్ చేశాడు. మార్నింగ్ వర్కవుట్ తర్వాత కిచెన్ లోకి వచ్చి ప్రిన్స్ హెల్ప్ చేయలేదని సందీప్ అన్నాడు. ప్రియాంక జైన్, దామిణిని రతిక నామినేట్ చేసింది. కారణం చెప్తూ.. ' డీలక్స్ రూమ్ లోకి అసలు ఎవరికి పర్మిషన్ లేదు. ఎలా వాళ్ళిద్దరు వెళ్ళి పడుకున్నారు. రూల్స్ ని అతిక్రమించినట్టు కాదు అతిక్రమించారని అందుకే వాళ్ళని నామినేట్ చేస్తున్నాని రతిక అనగా.. మీరు చెప్పిన ఈ రీజన్ ని వాళ్ళు అంగీకరిస్తారా అని అనగా.. రూల్స్ అందరికి ఒకటే కదా, వాళ్ళే కాదు మీరు కూడా అంగీకరించాలని బిగ్ బాస్ తో రతిక చెప్పింది. శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోర్ గౌతమ్ కృష్ణ, షకీల, దామిణి ఈ వారం నామినేషన్లో ఉన్నారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.