English | Telugu

Karthika Deepam 2: సుమిత్రకి క్యాన్సర్.. జ్యోత్స్న సొంత కూతురు కాదని తెలుస్తుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -562 లో... దీపని తీసుకొని శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ ఎక్కడ? దీపని మీరు తీసుకొని వచ్చారేంటి? అని కాంచన అడుగుతుంది. దీప ఏడుస్తుంటే కాంచనకి భయం వేసి.. ఏమైంది దీప ఎవరు ఏమన్నారని కాంచన అడుగుతుంది. పంతులు గారు చెప్పిన గండం వచ్చింది అత్తయ్య.. అది సుమిత్ర అమ్మని చుట్టుముట్టిందని దీప ఏడుస్తుంది. సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే అనసూయ, కాంచన షాక్ అవుతారు. ట్రీట్ మెంట్ ఉందని డాక్టర్ చెప్పారని శ్రీధర్ చెప్తాడు.

దీప ఏడుస్తుంటుంది. దీపకి సుమిత్ర వదిన అంటే ఎంత ఇష్టం సొంతకూతురు కాకపోయినా ఎంత బాధపడుతుందని కాంచన అంటుంది. నాకే బాధగా అనిపిస్తుంది అంటే రోజు సుమిత్ర అమ్మ దగ్గర ఉండే దీపకి ఇంకెంతలా ఉంటుందని అనసూయ అంటుంది. కాంచన నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి. దీప నువ్వు బాధపడకు నీ కడుపులో బిడ్డ ఉంది.. తనపై ఆ ప్రభావం చూపకూడదని శ్రీధర్ చెప్తాడు. కాంచన నువ్వు దీపకి అర్ధమయ్యేలా చెప్పమని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోతాడు.

మరొకవైపు డాక్టర్ మాటలు గుర్తుచేసుకొని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నేను ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నేను వారసురాలిని కాదని తెలుస్తుంది. నేను ఇక్కడ ఉండకూడదని జ్యోత్స్న బట్టలు సర్దుకొని బయటకు వెళ్లిపోతుంటే..కార్తీక్ ఎదురుగా వస్తాడు. తనని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటి మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారు.. మీరు వెళ్తున్నట్లు కనీసం మీ డాడీ, తాతయ్యలకు అయినా చెప్పారా అని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

అప్పుడే దశరథ్, శివన్నారాయణ వస్తారు. బావ నన్ను ఇలా ఇరికించాడేంటని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. తల్లి ఆ స్థితిలో ఉంటే కూతురు ఎవరైనా ఇలా చేస్తుందా.. అసలు నువ్వు కూతురివేనా అని శివన్నారాయణ అంటాడు. మేమ్ అంటే మీకు ఇష్టం లేదా జ్యోత్స్న అని దశరథ్ అంటాడు. అప్పుడే పారిజాతం వస్తుంది. జ్యోత్స్న నిర్ణయంలో నీ పాత్ర కూడా ఉందా అని శివన్నారాయణ అడుగుతాడు. నీ మనవరాలు ఇంట్లో నుండి వెళ్ళిపోతుందట అని శివన్నారాయణ అనగానే పారిజాతం కూడా షాక్ అవుతుంది. తాత నాకు అమ్మ పరిస్థితి చూసి భయం వేసి వెళ్తున్నానని చెప్తుంది. దాంతో శివన్నారాయణ తనపై కోప్పడతాడు. ఇక జ్యోత్స్న లోపలికి వెళ్తుంది.

జ్యోత్స్న ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ అదో ప్రాబ్లమ్.. వెళ్లకుండా ఆపేలే చేసావ్.. థాంక్స్ రా కార్తీక్ అని దశరథ్ అంటాడు. కాసేపటికి కార్తీక్ ఇంటికి వెళ్తాడు. బాధపడుతున్న దీపకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.