English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్న నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్.. దీప ఏడుపు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -561 లో.....సుమిత్ర గురించి తెలిసి ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతారు. దశరథ్ ఏడుస్తుంటే కార్తీక్ తన దగ్గరికి వచ్చి దైర్యం చెప్తాడు. సుమిత్ర స్పృహ లోకి వచ్చి.. ఏమైంది అందరు ఎందుకు కంటతడి పెట్టుకుంటున్నారని అడుగుతుంది. ఏం లేదని కార్తీక్ అంటాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని సుమిత్ర అనగానే ఏం లేదు అత్త అని కార్తీక్ సర్ది చెప్తాడు. నాకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం నా కూతురికి చెప్పకండి అని సుమిత్ర అంటుంది.

అ తర్వాత దీప ఒంటరిగా ఉండి ఏడుస్తుంటే అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. ఏంటి బాగా యాక్టింగ్ చేస్తున్నావ్.. అసలు నీ వల్లే ఈ దరిద్రాలు అన్ని అని దీపని పారిజాతం తిడుతుంది. అసలు ఒక కూతురిగా.. అమ్మ ఏమైంది ఇలా ఉన్నావని ఒక్కసారి అయిన అడిగావా.. పెంచిన ప్రేమ అయిన ఉండాలి కదా అని దీప అనగానే పెంచిన ప్రేమ ఏంటని జ్యోత్స్న అడుగుతుంది. పెంచుతారు కదా.. ఆ ప్రేమ అని దీప అంటుంది. దాంతో జ్యోత్స్నకి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక జ్యోత్స్న ని పారిజాతం లాక్కొని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇద్దరు దీప గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను వారసురాలిని కాదన్న నిజం తెలిసిపోతుందేమోనని పారిజాతంతో చెప్తూ జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. కాసేపటికి జ్యోత్స్న ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. అదేంటో పారిజాతానికి కూడా చెప్పదు.

మరొకవైపు ఏంటి నాన్న బయటకు వచ్చేసారని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. ఈ ఫైల్స్ జ్యోత్స్న ఫ్రాడ్ కి సంబంధించినవి.. అవి ఇంట్లో వాళ్ళకి చూపిద్దామనుకున్నాను కానీ ఇలా జరిగింది. ఇవి ఆఫీస్ నుండి కాశీ తీసాడు. ఇంట్లో దొరికాయని అనగానే కార్తీక్ మొత్తం విషయం ఏంటని అర్థం చేసుకొని శ్రీధర్ కి చెప్తాడు. దీనంతటికి అసలు సూత్రధారి జ్యోత్స్న అని కార్తీక్ చెప్తాడు. నిన్ను సీఈఓ పోస్ట్ నుండి తీయాలని వైరాతో చేతులు కలిపి కాశీని ట్రాప్ చేసిందని కార్తీక్ చెప్తాడు. ఈ ఫైల్స్ నీ దగ్గరే ఉంచమని శ్రీధర్ కి కార్తీక్ చెప్తాడు. దీప ఏడుస్తూనే ఉంది.. నువ్వు తనని ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యమని శ్రీధర్ తో కార్తీక్ చెప్పగానే శ్రీధర్ సరే అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.