English | Telugu

అత్యధిక ఫాలోయింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కామన్ మ్యాన్

బిగ్ బాస్ సీజన్-7 లో మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. వ్యవసాయం వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి బిగ్ బాస్ కి వెళ్ళాలనే కోరికతో దొరికిన ప్రతీ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. ఒకనొక దశలో చనిపోవడానికి సిద్ధమైన పల్లవి ప్రశాంత్.. వాళ్ళ నాన్న చెప్పిన కొన్ని మాటలతో బ్రతికాడని, ఇక చచ్చేం సాధిస్తాం, ఉన్నప్పుడే అనుకున్నది సాధించాలనే తపనతో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పల్టా తో మొదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే పవరస్త్రని ఎవరైతే దక్కించుకుంటారో వారే హౌజ్ లో ఉండటానికి అర్హులని అప్పటిదాకా కంటెస్టెంట్స్ మాత్రమే అని హోస్ట్ నాగార్జున చెప్పగా.‌ దానికి తగ్గట్టుగానే పల్లవి ప్రశాంత్ కష్టపడుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అందరూ దాదాపు సీరియల్స్, సినిమాలలో నటించి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే.. దాంతో అందరు కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైస్ బ్యాగ్, వాళ్ళ ఊరిలోని మట్టితో హౌజ్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. నాగార్జున ప్రశంసలు దక్కుంచుకున్నాడు. హౌజ్ లోకి వెళ్ళినప్పటి నుండి అందరితో కలిసి పోవాలనుకుంటున్న పల్లవి ప్రశాంత్ ని కావాలని కార్నర్ చేయాలని ప్రియాంక జైన్ నామినేషన్ చేసింది. దీంతో ప్రియాంక జైన్ మీద ఇప్పటికే ట్రోల్స్ మొదలుపెట్టారు నెటిజన్లు.

నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే అందరూ పల్లవి ప్రశాంత్ పేరు చెప్తున్నారు. ఎందుకంటే అతనైతే గట్టిగా అనలేడనేమో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అంటు ఒకరు నామినేట్ చేయగా, మాటతీరు బాగాలేదని మరొకరు, కలవట్లేదని మరొకరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో అందరు అతడినే టార్గెట్ చేస్తున్నారు. ఇక విరిగిపోయిన పల్లవి ప్రశాంత్ తనది తప్పు కాదని, తనకి కనిపించింది చెప్తుంటే అతనని అవహేళన చేస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుకుంటున్నారు ప్రియాంక జైన్, అమర్ దీప్, కిరణ్ రాథోర్, షకీల.. ఇలా అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టుగా ‌బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం గొడవలకు, వాదనలకు వెళ్ళకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ప్రశాంత్. అయితే బయట పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే అత్యధికంగా అయిదు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా, అమర్ దీప్, ప్రియాంక జైన్ నాలుగు లక్షల పైచిలుకు ఫాలోవర్స్ తో రెండు మూడు స్థానాలలో ఉన్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.