English | Telugu
రెహ్మాన్ దగ్గర ఛాన్స్ అందుకోబోతున్న సూపర్ సింగర్ పవన్ కళ్యాణ్...
Updated : Mar 7, 2024
సూపర్ సింగర్ షో సెమి ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సెమి ఫినాలేకి గెస్ట్ గా కోటి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ షోలో ఒక్కో కంటెస్టెంట్ ఓ రేంజ్ లో దుమ్ము దులిపేసారు. ఇక లాస్ట్ లో పవన్ కళ్యాణ్ వచ్చి "నువ్వుంటే నా జతగా" అనే సాంగ్ పడేసరికి కోటి ఒక్కసారిగా ఫైర్ ఐనట్టు "ఏయ్..ఏయ్..నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా" అనేసరికి అందరూ షాకైపోయారు. పవన్ కళ్యాణ్ కూడా తనేమన్నా తప్పు పడ్డాడేమో అనుకుని బాయపడిపోయాడు.
మళ్ళీ కోటి మాట్లాడుతూ "ఏయ్..నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జెంటుగా..నేను రెహ్మాన్ కి చెప్పేస్తా" అన్నాడు. తర్వాత మంగ్లీ "అసలేం పడ్డావ్..ఎం రేంజ్ నీది" అని మెచ్చుకుంది " నిజం చెప్తున్నా..రెహ్మాన్ ఈ పెర్ఫార్మెన్స్ చూస్తే పిలిచి పాట ఇస్తాడు నీకు" అని చెప్పారు కోటి. "రెహ్మాన్ సర్ మీ పాటను తప్పకుండా వినాలి..మీ ఈ పెర్ఫార్మెన్స్ ని ఆయనకు పంపిస్తాను..మీరు రెహ్మాన్ సర్ దగ్గర పాడాలి " అని చెప్పారు శ్వేతా మోహన్. ఇక రాహుల్ సిప్లిగంజ్ వచ్చి "ఈ షోలో ఇప్పటివరకు ఇలాంటి కాంప్లిమెంట్ రాలేదు" అని పవన్ కళ్యాణ్ ని పొగిడేసాడు. ఇక దీన్ని బట్టి రెహ్మాన్ దగ్గరకు ఈ షో నుంచి ఒక సింగర్ వెళ్ళబోతున్నాడనే విషయం తెలుస్తోంది. ఇక నెటిజన్స్ ఐతే పవన్ కళ్యాణ్ ఈ షో టైటిల్ విన్నర్ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.