English | Telugu

అప్పట్లో రాధ ఫొటోస్ పెట్టుకుని ఎవరూ లేనప్పుడు మాట్లాడుకునేవాడిని


నీతోనే డాన్స్ ఆదివారం ఎపిసోడ్ మంచి కలర్ ఫుల్ గా పోటాపోటీగా జరిగింది. ఈ వారం శని, ఆదివారం జరిగిన ఎపిసోడ్స్ లో అందరిని వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్స్ ని ఏమిటో అడిగింది శ్రీముఖి. అలాగే ఇప్పుడు తరుణ్ మాష్టర్ ని కూడా అడిగేసరికి. " ఈ షోలో ఒకరికి ఇంకొకరిపై ఫ్యాన్ మూమెంట్ ఉంది..కానీ మనకు ఇప్పటివరకు చెప్పలేదు. తరుణ్ మాష్టర్ కి ఫ్యాన్ మూమెంట్ కలిగిందా లేదా" అని తరుణ్ మాష్టర్ వైపు చూస్తూ అడిగింది. "నిజమే నాకు ఒక హీరోయిన్ ని చూస్తే చాలా ఎక్సయిట్మెంట్ కలిగేది. ఆమె ఫిలిమ్స్ ని నోరెళ్ళబెట్టుకుని చూసేవాడిని. ఆ హీరోయిన్ మరెవరో కాదు నా పక్కనే కూర్చున్నారు ఇప్పుడు. ఆ ఏజ్ లో రాధ గారి ఫొటోస్ ని అక్కడక్కడా పెట్టుకుని ఎవరూ లేనప్పుడు ఆ ఫోటోలను చూసుకుని ఆమెతో మాట్లాడేవాడిని. ఐతే నాకు చిరంజీవి గారి మీద కొంచెం జెలస్ గా ఉంది ..ఆయన చాలా చేశారు" అని తరుణ్ మాష్టర్ అన్నారు. "నేను తరుణ్ మాష్టర్ తో ఎక్కువగా వర్క్ చేయలేదు. కానీ ఆయన చూస్తే చాలా హోంలీగా , ఫ్రెండ్లీగా అనిపించేది.

ఆయన చాలా ఈజీగా కనెక్ట్ ఇపోయారు. అందుకే ఆయన మీద నాకు ఒక క్రష్ ఉండేది. అంటే ఆ క్రష్ కాదు" అని క్లారిటీ ఇచ్చారు రాధ. ఇక రాధ గురించి తరుణ్ మాష్టర్ అలా చెప్పేసరికి ఆమె లేచి ఆయన్ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. తరుణ్ మాష్టర్ కూడా రాధ చేతి మీద ముద్దిచ్చారు. ఈవారం ఎపిసోడ్ లో వీళ్ళ ఫ్రెండ్లీ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. తెలుగు,తమిళ, హిందీ మూవీస్ కి కొరియోగ్రఫీని అందించిన తరుణ్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆయన రజనీకాంత్ సినిమాలకు ఎక్కువగా పనిచేశారు. నరసింహ, బాబా వంటి రజనీకాంత్ మూవీస్ కి ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. ఆయన కూడా తలైవా అంటే చాలా ఇష్టం..ఆ విషయాన్నీ చాలా సందర్భాల్లో కూడా చెప్పారు తరుణ్ మాష్టర్.