English | Telugu
మేము చెప్పేదంతా సొల్లు అంటూ రష్మీ యాంకరింగ్ పై కామెంట్ చేసిన దొరబాబు
Updated : Jul 11, 2023
ఎక్స్ట్రా జబర్దస్త్ 450 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ గా ఎపిసోడ్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్. ఇందులో స్కిట్స్ అన్ని బాగా నవ్వించాయి. ఈ ఎపిసోడ్ 14 న ప్రసారం కాబోతోంది . దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో పటాస్ ప్రవీణ్ ఒక షిప్ ని నడుపుతూ ఉంటాడు..."ఈ షిప్ కి ఎంతో పెద్ద చరిత్ర ఉంది..ఖుష్బూ గారు ఈ పడవ ఎక్కి ఏమన్నారంటే ప్రవీణ్ కొన్ని ముత్యాలు తీసుకురా అన్నారు. నేను సప్త సముద్రాలు తిరిగాను కానీ ముత్యాలు దొరకట్లేదు అని చెప్పా ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో మీరు నవ్వుతుంటే రాలిపోతున్నాయి కదా" అని చెప్పానన్నారు ప్రవీణ్.
ఆ మాటలకు ఖుష్భు నవ్వేసరికి "ఉండుండు..ఆమె నవ్వారు ముత్యాలు ఏరుకుంటా" అంటూ కామెడీ చేశారు కృష్ణ భగవాన్. ఇక రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత స్కిట్ లో ఖుష్బూ రాకేష్ కి అత్తగారి క్యారెక్టర్ లో చేశారు. "అత్తా నువ్వు ఇంత తెల్లగా ఉంటావ్..ఏ పౌడర్ వాడతావు" అని రాకేష్ అడిగాడు "ఫారెన్ పౌడర్" అని చెప్పారు ఖుష్బూ "ఎంత పడింది" అని పౌడర్ కాస్ట్ ని రాకేష్ అడిగితె " ఇంత దులిపితే ఇంతే వచ్చింది" అని కౌంటర్ వేశారు ఖుష్బూ. ఇక ఫైనల్ లో వర్ష, ఇమ్ము పెళ్లి చేసుకుని వచ్చేసరికి స్కిట్లో ఇమ్ముకి తల్లిగా నటించిన మహిళ ఫుల్ గా తిట్టింది. "నా ఆశ నిరాశ చేసావ్ కదా. ఏ యాంగిల్ లో చూసి ఈమెను పెళ్లి చేసుకున్నావ్ " అని అడిగేసరికి "మీ అమ్మకు చెప్పలేదా కోడలొస్తోందని" అంది వర్ష..."మీ ఆవిడకు చెప్పలేదా పళ్ళు రాలగొడతానని" అని వర్షని ఉద్దేశించి అనేసరికి షాకయ్యాడు ఇమ్ము. ఇక ఫైనల్ గా దొరబాబు లేడీ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు. రష్మీ ని ఇమిటేట్ చేసాడు. "వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్..స్పాన్సర్డ్ బై వాళ్ళు, కోస్పాన్సర్డ్ బై వీళ్ళు, మేము చెప్పేదంతా సొల్లు" అనేసరికి రష్మీ ముఖం మాడిపోయింది.