English | Telugu

బిగ్‌బాస్ : సిరి సిగ్గు విడిచి అడిగేసింది!

ఎవ‌రు ఎన్ని చెప్పినా పేరెంట్స్ చీవాట్లు పెట్టినా బిగ్‌బాస్‌లో హ‌గ్గుల ప‌ర్వం మాత్రం ఆగ‌డం లేదు. సిగ్గు విడిచి మ‌రీ హ‌గ్గుల కోసం ఓ కంటెస్టెంట్ వెంప‌ర్లాడుతూరే వుంది. ఇలాంటి హ‌గ్గుల‌ని.. హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కింగ్ నాగ్ కూడా ఎంక‌రేజ్ చేస్తుండ‌టం నెటిజ‌న్‌ల‌తో పాటు వీక్ష‌కుల‌కు విసుగు పుట్టిస్తోంది. ఇంత‌కీ బిగ్‌బాస్ హౌస్‌లో హ‌గ్గుల కోసం త‌హ త‌హలాడుతున్న జంట ఎవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మై వుంటుంది.. య‌స్ సిరి, ష‌ణ్ముఖ్‌.

బిగ్ బాస్ హౌసా, హ‌గ్ బాస్ హౌసా.. నాగ్ పై మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

బ‌య‌టి నుంచి వీరి హ‌గ్గుల అరాచ‌కాలు చూడ‌లేక హౌస్‌లోకి వ‌చ్చిన వీరి త‌ల్లులు మీ హ‌గ్గులు మాకు న‌చ్చ‌డం లేదు.. మ‌రీ హ‌ద్దులు దాటేస్తున్నార‌ని.. మ‌రీ ఓవ‌ర్‌గా వుంద‌ని చీవాట్లు పెట్టినా మ‌మ్మీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ సిగ్గు విడిచి మ‌రీ అడుగ్గుని హ‌గ్గులు చేసుకునే స్థాయికి ఈ జంట చేర‌డం వీక్ష‌కుల‌కు కంప‌రాన్ని క‌లిగిస్తోంది. సోమ‌వారం బిగ్‌బాస్ 93వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైంది. ఈ సంద‌ర్భంగా సిరి , ష‌ణ్ముఖ్ హ‌గ్ కోసం వెంప‌ర్లాడ‌టం.. సిగ్గు విడిచి మ‌రీ మమ్మీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అని చెప్ప‌డంతో కంటెస్టెంట్‌ల‌తో పాటు వీక్ష‌కులు కూడా విస్తూ పోయారు. ఓరినీ ఏషాలో అంటూ ముక్కున వేలేసుకుని షాక్ అయ్యారు.

బిగ్‌బాస్ విజేత‌పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

93వ ఎపిసోడ్ ఈ జంట నుంచే మొద‌లైంది. జ‌న్యూన్ అంటే ఈ హైస్‌లో దొబ్బ‌ద‌ని ష‌న్ను అంటుంటే .. పింకీని నాకు నేనే గుర్తొచ్చాన‌ని, అందుకే దానికి నేను క‌నెక్ట్ అయిపోయాన‌ని సిరి చెప్పింది. ఇదే స‌మ‌యంలో కాజ‌ల్ .. సిరి ద‌గ్గ‌రికి వ‌చ్చి త‌ల‌పై ముద్దు పెట్టి పింకీ ఒక్క పాయింట్‌తో వెళ్లిపోయింది అంటుంది. ఇది గ‌మ‌నించిన ష‌న్ను సిరికి కాజ‌ల్‌తో జాగ్ర‌త్త అని గీతోప‌దేశం చేస్తాడు. ఈ వారం నువ్వా లేక మాన‌సా ఎలిమినేట్ అయ్యేద‌నే పాయింట్ ని తెలుసుకుని త‌న గేమ్ ప్లాన్ మార్చుకోవాల‌నే కాజ‌ల్ నీతో మాట్లాడుతోంద‌ని, మిగ‌తా వాళ్ల‌తో క‌లిసి గేమ్ ఆడాల్సిన ప‌నిలేదు. వాళ్లు నీతో ఆడుకోకుంటే చాలు అంటాడు ష‌న్ను .. ష‌న్ను ఇంత‌లా గీతోప‌దేశం చేశాక హ‌గ్గు అడ‌క్కుండా వుంటుందా.. మొత్తానికి అడిగేసింది. మ‌మ్మీ ఇది ఫ్రెండ్షిప్ హ‌గ్ మాత్ర‌మే అంటూ సిరి చెప్ప‌డంతో నెటిజ‌న్స్ ఈ జంట‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.