English | Telugu
Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ కంటెండర్స్ గా రీతూ, సంజన.. సోహెల్ ని ఓడించారుగా!
Updated : Nov 28, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో గత వారం ఫ్యామిలీ వీక్ సాగగా.. ఈ వారం కెప్టెన్సీ కోసం టాస్క్ లని భిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సీజన్-4 లో సోహెల్ అంటే తెలియని వాళ్ళుండరు.. పాతిలక్షల సూట్ కేస్ తీసుకొనివచ్చిన తొలి కంటెస్టెంట్ గా సోహెల్ రికార్డు సృష్టించారు.
డీజే టిల్లు సాంగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోహెల్ ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో సరదాగా ఉన్నాడు. ఏంటి మీకు ఆరు వారాలా దాకా చికెన్ పెట్టలేదంట.. నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారూ.. నాకు అర్థం కాదూ.. నేనైతే దూకి వెళ్లిపోయేవాడ్ని.. బిగ్ బాస్ మాట్లాడు బిగ్ బాస్.. మాట్లాడూ.. నా ఇజ్జత్ పోతుందని సొహెల్ అన్నాడు. అయినా బిగ్ బాస్ మాట్లాడలేదు.. కాసేపటికి సొహెల్ ఎలా ఉన్నావంటూ బిగ్ బాస్ అడుగగా.. హా సూపర్ బిగ్ బాస్ అని సోహెల్ అన్నాడు. సోహెల్ అంటే కథ వేరుంటందని అని అనగా.. అయితే రెండు పాల ప్యాకెట్లు, కాఫీ పౌడర్, రెండు కేజీల చికెన్ పంపించమని రీతూ, ఇమ్మాన్యుయల్ అడుగుతారు. ఇక కెమెరాల ముందుకి వెళ్ళి సోహెల్ రిక్వెస్ట్ చేశాడు. ఇది నా ఇజ్జత్‌కే సవాల్.. మీకు దండం పెడతాను.. వీళ్లకి రెండు పాల ప్యాకెట్లు.. చికెన్.. కాఫీ పౌడర్ పంపించండి అని మెల్లిగా రిక్వెస్ట్ చేశాడు. వాడి బాడీ లాంగ్వేజ్ ఒకటీ.. అడిగేది మరొకటి అని భరణి అన్నాడు. ఇక కాసేపటికి బిగ్ బాస్ చికెన్, కాఫీ పొడి, పాలప్యాకెట్ల బొమ్మల్ని పంపించాడు. అవి చూసి అందరు నవ్వుకున్నారు కాసేపటికి కాఫీ పౌడర్, పాల ప్యాకెట్లు, చికెన్ నిజంగానే బిగ్ బాస్ పంపించాడు.
ఇక కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో నిల్చునేందుకు సోహెల్ తో సంజన, రీతు పోటీ పడ్డారు. ఇందులో సోహెల్ ఓడిపోయాడు. సంజన, రీతూ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఇంటి కెప్టెన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.