English | Telugu
రాహుల్ అడ్డంగా దొరికిపోయాడు.. వెనకేసుకొచ్చిన స్వప్న!
Updated : Oct 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -232 లో.. మీ అమ్మ తీసుకొని రమ్మని చెప్పిందని అప్పుని కళ్యాణ్ తీసుకొని బయటకు వస్తాడు. బయటకు రాగానే అనామిక కూడా ఉంటుంది. షాపింగ్ కి అంటే రావని అలా చెప్పాను. మీ అమ్మ కూడా రమ్మంది. ఆ పని చూసుకొని షాపింగ్ కీ వెళదామని అప్పుతో కళ్యాణ్ అనామిక అంటారు. ఇక చేసేదేమీ లేక అప్పు వాళ్లతో బయల్దేరుతుంది.
మరొక వైపు కావ్య ఇంట్లో అందరికి కాఫీ ఇస్తుంది. సారి అత్తయ్య లేట్ అయిందని అపర్ణకి కావ్య చెప్తుంది. తప్పు చేయడమెందుకు? సారీ చెప్పడం ఎందుకని అపర్ణ అనగానే.. లేట్ అయిందని అలా అనడం కరెక్ట్ కాదని సుభాష్ అంటాడు. కావ్య ఒక్కతే చకచక పనులు చేస్తంటే సీతారామయ్య ఇందిరాదేవి చూసి మురిసిపోతుంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం గ్రేట్ అనుకుంటు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య ఒక్కతే పనులు చేస్తుందని కనకం వచ్చి హెల్ప్ చెయ్యడానికి ట్రై చేస్తూ ఉంటే.. కనకంపై అపర్ణ కోప్పడుతుంది. ఈ ఇంట్లో కోడలు చెయ్యాలిసినవి తనని చెయ్యనివ్వండి. అప్పుడే బాధ్యతలు తెలుస్తాయని అపర్ణ అనగానే.. అవును అమ్మ నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని కనకంకి కావ్య చెప్తుంది. మరొక వైపు రాహుల్ లాయర్ కి ఫోన్ చేసి మైఖేల్ కీ బెయిల్ అప్లై చెయ్యండని చెప్తాడు. పది లక్షలు ఇస్తేనే బెయిల్ కి అప్లై చేస్తానని లాయర్ అంటాడు. ఇప్పటికిప్పుడు పది లక్షలంటే ఎలా అని రాహుల్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే స్వప్న తన నగలు చూస్తు మురిసిపోతుంటుంది. స్వప్న దగ్గరికి వెళ్లి నగలు కావాలని అడుగుతాడు.
నగలెందుకు? తాకట్టు పెట్టడానీకా, నేను ఇవ్వను. నాకు తాతయ్య వాళ్ళు ఇచ్చినవి. వాళ్ళు అడిగితే మళ్ళీ ఏం సమాధానం చెప్పలేనని స్వప్న అవి బీరువా లో పెట్టుకొని వెళ్తుంది. ఆ తర్వాత స్వప్నకి తెలియకుండా రాహుల్ నగలు తీసుకొని వెళ్తాడు. హాల్లో ఉన్న రాజ్ ఏంటవి అని అడుగుతాడు. ప్రకాష్ ఏంటి అవి చూస్తుండగా.. అందులో నుండి నగలు కిందపడిపోతాయి. కిందపడి ఉన్న నగలు చూసి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావంటు అందరు అడుగుతారు. రాహుల్ టెన్షన్ పడుతు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే స్వప్న వచ్చి.. ఎందుకు రాహుల్ ని అందరు దొంగని చూసినట్లు చూస్తున్నారు. నేనే నగలు మెరుగుపెట్టించుకు రమ్మని చెప్పానని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ తన నటన మొదలుపెడతాడు. నన్నెవరు నమ్మడం లేదని, ముఖ్యంగా రాజ్ నన్ను నమ్మడం లేదని యాక్ట్ చేస్తాడు. మరొక వైపు షాపింగ్ పూర్తి చేసుకొని అప్పు, కళ్యాణ్, అనామిక వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.