English | Telugu

స్వప్నకి పెళ్ళి ఇష్టం లేదనే నిజాన్ని కనకంకి చెప్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. రోజుకో ట్విస్ట్ తో సాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్-25 లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. రాహుల్ కన్నింగ్ గా అలోచించి స్వప్నకి రాజ్ తో పెళ్లి చూపులు జరగకుండా చెయ్యాలని చూస్తాడు. రాహుల్ చెప్పే మాయమాటలు స్వప్న నిజమని నమ్ముతుంది. కాగా స్వప్నకి సర్ ప్రైజ్ అని గదిలోకి తీసుకెళ్ళిన రాహుల్ తన ఒడిలో స్వప్నని కూర్చోపెట్టుకొని గిటార్ ప్లే చేసి తన మ్యూజిక్ టాలెంట్ చూపిస్తాడు. దానికి స్వప్న మనసు గాల్లో తేలుతుంది.

మరోవైపు అప్పు స్వీట్స్ తీసుకొని వస్తుండగా బైక్ పాడైపోతుంది. దీంతో ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని వెయిట్ చేస్తుంటుంది. అంతలోనే కళ్యాణ్ రావడంతో, అతని కార్ లో వచ్చి తను ఒక చోట దిగి వెళ్తుంది. ఇక రాహుల్ నెక్లెస్ తీసుకొచ్చి.. "ఇది నాకు కాబోయే భార్య కోసం నేను తీసుకున్నా" అని స్వప్నకి ఇస్తాడు. అయ్యో మీరు రాజ్ కి కాబోయే భార్య కదా.. మీకు ఇస్తున్నానేంటి.. నన్ను క్షమించండని రాహుల్ అనగానే.. ఏం పర్వాలేదండి.. నాకు రాజ్ అంటే ఇష్టం లేదు మీరంటేనే ఇష్టమని స్వప్న చెప్తుండగా.. ఇంతలోనే కావ్య వచ్చి డోర్ కొడుతుంది. వెంటనే రాహుల్ పక్కన దాక్కుంటాడు. తర్వాత స్వప్న వెళ్ళి డోర్ తీస్తుంది. స్వప్నని చూసి కావ్య షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడ ఉన్నావని తన వెంట స్వప్నని తీసుకొని వెళ్తుంది కావ్య.

స్వప్న ఇంటికి వెళ్లడంతోనే.. తన పర్ఫామెన్స్ మొదలు పెడుతుంది. రాజ్ నానమ్మ తాతయ్యల కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. కార్ ఆగిపోయింది.. ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిందని అనడంతో అందరూ నమ్మేస్తారు. స్వప్న యాక్టింగ్ ని నమ్మిన రాజ్ ఫ్యామిలీ.‌ రాజ్, స్వప్నల పెళ్లికి ఓకే చెప్తారు. ఆ తర్వాత పంతులు ముహుర్తాలు చూసి.. మూడు నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్తాడు. అప్పటివరకు ఎలా అని కనకం ఆలోచిస్తుంటుంది. కనకం రిచ్ కాదేమోననే విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని అనుకోని టెన్షన్ పడుతుంది. మరోవైపు పెళ్ళికి టైం ఉంటే రాహుల్ గురించి అమ్మకి చెప్పొచ్చని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.