English | Telugu
నేనేం చేసినా ఎస్ చెప్పే నాన్న నాకున్నాడు.. ఫైమా ఎమోషనల్!
Updated : Feb 21, 2023
ఫైమా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజన్-6 తో సెలబ్రిటీ లిస్ట్ లోకి చేరిపోయిన ఈ పటాస్ పిల్ల.. బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. ఫైమా ప్రతీ వీకెండ్ శని, ఆదివారాలలో ప్రసారమవుతున్న బిబి జోడీ డ్యాన్స్ షో లో పాల్గొంటూ.. తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫైమా చిన్నప్పటి నుండి నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగింది. ఎన్నో కష్టాల నుండి ఈ స్థాయికి చేరుకున్నానని చాలా సందర్భాలలో తను చెప్పుకొచ్చింది. ఫైమా మొదటగా కాలేజీ తరపున పటాస్ ప్రోగ్రామ్ కి వెళ్ళగా.. తన కామెడీ టైమింగ్ బాగుండడంతో తర్వాత ప్రోగ్రామ్ కి తీసుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదిగి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.
బిగ్ బాస్ హౌస్ లో కూడా తనదైన స్టైల్ లో గేమ్ అడి చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ పూర్తయ్యాక ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ తన ప్రతి విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది ఫైమా. అయితే తాజాగా ఫైమా వాళ్ళ నాన్నని బైక్ మీద ఎక్కించుకొని వెళ్తున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే పోస్ట్ చేసిన ఆ వీడియోకి కొన్ని ఎమోషనల్ మాటలని జోడించింది. "ప్రతి కూతురు ఏం చేసినా తన తల్లి మొదట వద్దు అనే అంటుంది. కానీ నాకా వర్రీ లేదు. ఎందుకంటే నేనేం చేసిన ఎస్ చెప్పే నాన్న ఉన్నాడు. ఐ లవ్ యు డాడీ" అనే కాప్షన్ తో పోస్ట్ చేసింది. ఈ వీడీయోని చూసిన తన ఫ్యాన్స్.. 'యూ అర్ గ్రేట్, అల్ రౌండర్ ఫైమా, బెస్ట్ డాన్సర్, బెస్ట్ కమెడియన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైమా బిబి జోడిలో తన డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తుంది. మరోవైపు పలు ఈవెంట్స్ తో బిజీగా ఉంటూ కూడా తనకు దొరికిన టైంలో ఫ్యామిలీతో కొంత సమయం గడపడం గ్రేట్ అని అంటున్నారు తన ఫ్యాన్స్.