English | Telugu

కృష్ణని కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తున్న మురారి! 


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -86 లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో.. ముకుంద, మురారిల ప్రేమ విషయం రేవతికి మొత్తం చెప్పేస్తాడు గోపి. ఇన్ని రోజులు మురారిని అపార్ధం చేసుకున్నాను.. ఈ ఫ్యామిలీ కోసం తన ప్రేమని త్యాగం చేసాడు.. పాపం మురారి.. ముకుంద ఒక ప్రేమోన్మాది లాగా ప్రవర్తిస్తుందని రేవతి అనుకుంటుంది. ముకుంద ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తనతీరును గుర్తు చేసుకుంటుంది రేవతి.

రేవతి తనకు గోపి చెప్పిన విషయాన్ని ఈశ్వర్ తో చెప్పడానికి వెళ్తుంది. అయితే ఈశ్వర్ డ్రింక్ చేస్తుండటంతో, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని అనుకుంటుంది. ఇకమీద కృష్ణ, మురారిల జోలికి రాకుండా ముకుందని నేనే చూసుకోవాలని రేవతి తన మనసులో అనుకుంటుంది.

తర్వాత కృష్ణ కాలేజీకి రెడీ అయి వెళ్తుంటుంది. అందుకని నందుకి సొంతంగా అన్నం తినడం నేర్పిస్తుంది కృష్ణ. మరోవైపు గదిలో ఉన్న మురారి దగ్గరికి రేవతి హారతి తీసుకొని వస్తుంది. అప్పుడు రేవతిని మురారి అడుగుతాడు. అమ్మ నా వల్ల ఈ ఇంట్లో ఎవరైనా బాధపడుతున్నారా? నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా? అలాంటిదేమైనా ఉంటే నువ్వే చెప్పాలి అమ్మ అని మురారి అడగడంతో.. అలాంటిదేమీ లేదు మురారి అని రేవతి అంటుంది. "నువ్వు బాధపడకూడదని ఈ రోజు కృష్ణని కాలేజీలో జాయిన్ చెయ్యడానికి వెళ్తున్నా" అని మురారి చెప్తాడు. సరే మురారి.. ఈ రోజు మంచిరోజు వెళ్ళండని రేవతి చెప్తుంది.ఇక కృష్ణ, మురారీలు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతారు. అక్కడే ఉన్న ముకుంద నేను కూడా వస్తాను, ఒంట్లో కొంచెం నలతగా ఉందని అంటుంది. అది విన్న రేవతి.. "నువ్వు ఎందుకమ్మా వెళ్ళడం.. మనం వెళ్దాం.. నువ్వు ఇక్కడ వీధి చివర్లో ఉన్న హాస్పిటల్ లో చూపించుకుందువు" అని అంటుంది. ఆ తర్వాత ముకుంద మౌనంగా ఉండిపోతుంది. మురారి మీరు బయల్దేరండి, దుర్ముహూర్తంని వెంట పెట్టుకొని వెళ్ళడం ఎందుకని ముకుందని చూస్తూ అంటుంది రేవతి. సరేనని చెప్పేసి.. కృష్ణ, మురారిలు కాలేజీకి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.