English | Telugu

హౌస్ లో కొత్త కెప్టెన్ గా  సూర్య!

బిగ్ బాస్ హౌస్ లో గత మూడు రోజులుగా సాగుతోన్న కెప్టెన్సీ టాస్క్ నిన్నటితో ముగిసింది. అయితే చివరగా నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే టాస్క్ జరిగింది. ఇందులో కెప్టెన్ పోటీదారులుగా శ్రీసత్య, వసంతి, అర్జున్ ,ఆదిరెడ్డి, రేవంత్, సూర్య, రాజ్, రోహిత్ లు ఉండగా, ఇందులో ఫైమా సంచాలకులురాలిగా వ్యవహరించింది. కాగా టాస్క్ నియమాలు బిగ్ బాస్ వివరించాడు. "పోటీదారుల ఫోటో మరియు పేరుతో ఉన్న పూలకుండీలు ఉంచబడ్డాయి. అయితే బజర్ రాగానే ఎవరు అయితే వారి పేరుతో ఉన్న పూలకుండి కాకుండా వేరే వాళ్ళది తీసుకువస్తారో వారు సేఫ్, వారిది వారు తీసుకెళ్తే గేమ్ నుండి అవుట్ అవుతారు. అందరికంటే చివరగా తెచ్చిన పోటీదారులు మరియు తన చేతిలో ఎవరి పూల కుండి ఉంటుందో వారు, ఇద్దరు మిగత హౌస్ మేట్స్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే టాస్క్ లో కొనసాగుతారు. మిగతా పోటీదారు టాస్క్ నుండి తొలగించబడతాడు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.

ఈ టాస్క్ లో మొదటగా రాజ్ తన పూల కుండి తానే తెచ్చుకోవడం వల్ల టాస్క్ నుండి తొలగిపోగా, తర్వాత చివరగా ఆదిరెడ్డి, వసంతి వచ్చారు. హౌస్ మేట్స్ ఓట్లలో ఎక్కువ ఆదిరెడ్డికి రాగా, ఆదిరెడ్డి గేమ్ లో ముందుకెళ్ళాడు. వసంతి టాస్క్ నుండి తొలగించబడింది. తర్వాత రేవంత్, శ్రీసత్య మిగిలారు. ఓట్లు శ్రీసత్యకి ఎక్కువ వచ్చాయి. తను ముందుకెళ్ళగా, రేవంత్ తొలగించబాడ్డాడు. తర్వాత అర్జున్ మరియు రోహిత్ మిగిలారు. రోహిత్ టాస్క్ లో ముందుకెళ్ళగా, అర్జున్ తొలగిపోయాడు. చివరగా సూర్య మరియు రోహిత్ ఉండగా రోహిత్ కు ఎవరు సపోర్ట్ చెయ్యలేదు. సూర్యకి హౌస్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ రావడంతో, సంచాలకులురాలిగా వ్యవహరించిన ఫైమా, కెప్టెన్ గా సూర్యని ప్రకటించింది.

ఆ తర్వాత కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన సూర్యకి, హౌస్ మేట్స్ అందరు కృతజ్ఞతలు తెలిపారు. "రాజు ఎక్కడున్నా రాజే" అంటూ ఇనయా అనగా, సూర్య 'ప్రభాస్' లా మిమిక్రీ చేసి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక హౌస్ లో తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాడో చూడాల్సి ఉంది.