English | Telugu
వంట గదిలో గంటె తిప్పిన డాక్టర్ బాబు..
Updated : Feb 2, 2022
కార్తిక దీపం` సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు పరిటాల నిరుపమ్. ఈ సీరియల్ తో డాక్టర్ బాబుగా పాపులర్ అయిన నిరుపమ్ బుల్లితెర శోభన్ బాబు అనిపించుకుంటున్నారు. కార్తీకదీపంలో దీప వంటలక్కగా పాపులర్ అయింది. ఆమె గరిటె పట్టిందంటే ఘుమఘుమలాడాల్సిందే. అయితే అదే పనికి డాక్టర్ బాబు పూనుకుంటే.. కొత్తగా ప్రయోగం చేస్తానంటూ వంట గదిలో దూరితే.. ఎలా వుంటుంది? .. ఇంతకీ డాక్టర్ బాబు వంట గదిలోకి ఎందుకు దూరాడు? .. ఏం చేయడానికి రెడీ అయిపోయాడు అన్నది ఒక సారి చూద్దాం.
Also Read:దీపకు అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ బాబు
సీరియల్ షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఇంట్లో వుండిపోయిన డాక్టర్ బాబు ఫ్యాన్స్ కోసం కొత్త వంటకాన్ని కనిపెట్టారు. ఫ్యామిలీ షాపింగ్ కి వెళ్లి పోవడంతో ఇంట్లో ఒంటరిగా వున్న డాక్టర్ బాబుకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. తన ఫ్యామిలీ ఇంటికి తిరిగి వచ్చే లోపు అదిరిపోయే బిర్యానీ చేసి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అయితే అది రెగ్యులర్ బిర్యానీలా కాకుండా కొంచెం కొత్తగా వుండాలని ప్లాన్ చేశాడు. అనుకున్న వెంటనే రంగంలోకి దిగేశాడు.
దమ్ బిర్యానీలా కాకుండా కొత్తగా కుక్కర్ బిర్యానీకి శ్రీకారం చుట్టాడు. వంటలక్కని మించేలా కుక్కర్ బిర్యానీతో అందరిని ఆకట్టుకోవాలని ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. డాక్టర్ బాబు చేసిన బిర్యానీ పేరు `కుక్కర్ చికెన్ బిర్యానీ`. ఇందులో ఏముందని అనుకోవచ్చు.. అన్నీ కలిపి కుక్కర్ లో నెట్టి మూడు విజిల్స్ వచ్చాక బిర్యానీ రెడీ అయిపోతుంది. కానీ కుక్కర్ విజిల్ పెట్టకుండా బిర్యానీ చేయడమే మన డాక్టర్ బాబు కుక్కర్ బిర్యానీ స్పెషాలిటీ. డాక్టర్ బాబు చేసిన కుక్కర్ బిర్యానీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.