English | Telugu
శ్రీముఖికి సుమ సీరియస్ వార్నింగ్!
Updated : Feb 20, 2021
పాపులర్ యాంకర్ సుమ క్రేజీ హాట్ యాంకర్ శ్రీముఖికి కబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. "కనకాల కంచుకోటలోకి వచ్చిన వాళ్లకి కబర్దార్.. నేను మూడు లెక్కెట్టే లోపు ఎవరికి వాళ్లు వాళ్ల స్థానంలో వుండాలి... మొత్తం సెట్టవ్వాలి" అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో శ్రీముఖి బిత్తర చూపులు చూస్తూ సుమతో కలిసి కౌంట్ డౌన్ లెక్కిస్తూ 3 అనే సరికి గట్టిగా సుమని కౌగలించుకుని నవ్వేసింది.
వివరాల్లోకి వెళితే... సుమ కనకాల స్టార్ మాలో 'స్టార్ట్ మ్యూజిక్'` పేరుతో ఓ సరదా షోని ప్రారంభించారు. దీనికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సండే ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం ఈ షోకి శ్రీముఖి, విష్ణుప్రియ, రోల్ రైడా, ఆర్జే చైతూ, హరి, పండు హాజరయ్యారు. ఇందులో భాగంగా "సో.. నా షోకు నేనొచ్చేశాను కాబట్టి ఇంకెందుకు లేటు.. షో మొదలెడదామా" అంటూ శ్రీముఖి అనడంతో స్టేజ్‌పై ఒక్కసారి ఉరుములు మెరుపులు మొదలయ్యాయి.
కట్ చేస్తే.. మోయలేని గదని ఈడ్చుకుంటూ, ముఖం చిట్లించుకుంటూ కేజీఎఫ్ ఆర్ ఆర్‌తో సుమ సీరియస్‌గా రావడం.. శ్రీముఖికి వార్నింగ్ ఇవ్వడం టీవీ వీక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ ఎపిసోడ్ వచ్చే సండే 12 గంటలకు ప్రసారం కానుంది.