English | Telugu
రియల్ లైఫ్‌లో 'కార్తీక దీపం' మోనిత ఎవరో తెలుసా?
Updated : Feb 20, 2021
స్టార్ మాలో ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ 'కార్తీక దీపం'. నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వంటలక్కగా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ బుల్లితెరపై స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇదే సీరియల్‌లో దీపని అష్టకష్టాలు పెడుతూ డాక్టర్ బాబును తన సొంతం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించే మోనిత పాత్ర కూడా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ మోనిత ఎవరన్నది ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సీరియల్‌లో మోనితగా నటిస్తున్న నటి పేరు శోభా శెట్టి. బెంగళూరులోని ఒక తుళు ఫ్యామిలీలో పుట్టిన శోభా శెట్టి తెలుగు సీరియల్ 'కార్తీక దీపం'తోటే వెలుగులోకి వచ్చింది. మంచి పాపులారిటీని దక్కించుకుంది. కన్నడ, తుళు, తెలుగు ఇండస్ట్రీల్లో పని చేసింది. 2013లో నటిగా కన్నడ కలర్స్ టీవీలో ప్రసారమైన 'అగ్ని సాక్షి' సీరియల్‌తో కెరీర్‌ని ప్రారంభించింది శోభ.
2017లో పునీత్ రాజ్‌కుమార్, రష్మిక మందన్న జంటగా నటించిన 'అంజనీ పుత్ర' సినిమాతో వెండితెరకు సైతం పరిచయమైంది. టిక్ టాక్ వీడియోలతోనూ పాపులారిటీని దక్కించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి ప్రస్తుతం 'కార్తీక దీపం', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సీరియల్స్‌లో నటిస్తోంది.