English | Telugu
ఫ్రెండ్ ఇంట్లో ఉరేసుకున్న 25 ఏళ్ల టీవీ యాక్టర్!
Updated : Feb 20, 2021
శుక్రవారం ఇందిరా కుమార్ అనే టెలివిజన్ యాక్టర్ మృతి చెందాడు. అతని వయసు కేవలం 25 సంవత్సరాలు. తమిళ సీరియల్స్‌లో నటిస్తున్న అతను చెన్నైలోని తన ఫ్రెండ్ నివాసంలో ఉరివేసుకొని ఉండగా కనుగొన్నారు. అందిన సమాచారం మేరకు, తన ఫ్రెండ్‌ను కలుసుకోవడానికి అతని ఇంటికి వచ్చిన ఇందిరా కుమార్, మరుసటి రోజు పొద్దున్నే ఉరేసుకుని కనిపించాడు. ఆందోళనకు గురైన అతని ఫ్రెండ్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
రిపోర్టుల ప్రకారం, ఇందిరా కుమార్ మృతికి కారణాలు వెల్లడి కాలేదు. సూసైట్ నోట్ లాంటిదేమీ పోలీసులకు లభించలేదు. ఆశించిన అవకాశాలు రాకపోతుండటంతో అతను మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తమిళ టీవీ రంగంలో చెప్పుకుంటున్నారు. అతను శ్రీలంకకు చెందిన తమిళుడు. కొన్ని పాపులర్ తమిళ సీరియల్స్‌లో నటించాడు. అతనికి భార్య, పసివాడైన కుమారుడు ఉన్నారు. చెన్నైలోని శరణార్ధి శిబిరంలో ఉంటున్నాడు. ధనుష్ సినిమా 'తూటా'లో నటించాడు.