English | Telugu

ర‌విని యాంక‌రింగ్ మానేయ‌మన్న‌ సుమ‌!

బుల్లితెర‌పై ఎదు‌టి వ్య‌క్తిని ఊపిరి తీసుకోకుండా వ‌రుస పంచ్‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌గ‌ల చాతుర్యం సుమ సొంతం. ‌పుట్టింది కేర‌ళ కుట్టిగానే అయినా తెలుగుపై వున్న ప్రేమ‌తో తెలుగు వాళ్లే ఆశ్చ‌ర్య‌పోయేలా స్పాంటేనియ‌స్‌గా పంచ్‌లు వేయ‌డం సుమ స్పెషాలిటీ. ఆ పంచ్‌ల‌కు స్టార్ హీరోలే స‌రెండ‌ర్ అంటూ చేతులెత్తేసిన సంద‌ర్భాలెన్నో..

లాక్‌డౌన్ త‌రువాత సుమ స్టార్ మా చాన‌ల్‌లో వ‌రుస షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. జీ తెలుగులోనూ త‌ను ఎంట్రీ ఇచ్చేసింది. యాంక‌ర్ ర‌వితో క‌లిసి 'బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్‌'కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ఆదివారం శివ‌బాలాజీ, మ‌ధురిమ జంట ఈ షోలో పాల్గొన‌బోతున్నారు. వారితో క‌లిసి సుమ‌, ర‌వి త‌మ‌దైన స్టైల్లో వినోదాన్ని పండించ‌బోతున్నారు.

అయితే ఈ షోలో స‌ర‌దాగా యాంక‌ర్ ర‌వి మ్యాజిక్ చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డంతో సుమ "ర‌వీ.. నా మాట విను. నువ్వు యాంక‌రింగ్ మానేసి ఇదే చెయ్యి. నీకు చాలా బాగుంట‌ది." అంటూ పంచ్ లేయ‌డంతో యాంక‌ర్ ర‌వికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సుమ‌, యాంక‌ర్ ర‌వి పంచ్‌ల‌తో న‌వ్వులు పూయిస్తున్న ఈ షోని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఈ ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు 'బిగ్ సెల‌బ్రిటీ ఛాలెంజ్' చూడాల్సిందే.