English | Telugu

అమ్మ రేపు రాదా?.. కార్తీక్‌ని నిల‌దీసిన హిమ‌!

నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సీరియ‌ల్ 'కార్తీక దీపం'. గ‌త కొంత కాలంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల మ‌హిళా లోకాన్ని ఉర్రూత‌లూగిస్తున్న ఈ సీరియ‌ల్ టాప్ రేటింగ్‌తో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. రోజు రోజుకీ వ‌రుస ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటోంది. ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది.

ఇక ఈ శ‌నివారం ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో సాగ‌బోతోంది. గ‌త కొంత కాలంగా చెప్పుడు మాట‌లు వింటూ త‌న భార్య దీప‌ని అపార్థం చేసుకుంటూ కార్తీక్ గ‌త కొన్ని ఎపిసోడ్‌ల‌లో దూరం పెడుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే దీప‌ని ఇంటికి పిల‌వ‌మ‌ని హిమ కార్తీక్‌తో అంటుంది. "నేను ఒక్క‌డినే వుంటే నాతో వుండ‌వా?" అంటాడు కార్తీక్‌. "అంటే అమ్మ రేపు రాదా డాడీ" అంటుంది హిమ‌.. దాంతో విసుగొచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్‌.

క‌ట్ చేస్తే .. అత్త‌య్య డాక్ట‌ర్ బాబుకి నిజం చెప్పివుంటుందా? ఇంకా త‌న నుంచి ఫోన్ రాలేద‌ని దీప ఎదురుచూస్తూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో శౌర్య ఫోన్ నుంచి హిమ ఫోన్ చేస్తుంది. "అమ్మా నేను హిమ‌ని.. నువ్వు ఎప్పుడూ నిజం చెప్ప‌వా?" అని ప్ర‌శ్నిస్తుంది. "అంద‌రం క‌లిసిపోతాం అన్నావ్‌, క‌లిసి వుంటాం అన్నావ్‌?" అని నిల‌దీస్తుంది.

క‌ట్ చేస్తే కార్తీ డ్రైవ‌ర్ అంజీతో మాట్లాడుతుంటే "పెద్దోడా నీతో మాట్లాడాలి" అని ప‌క్క‌కు లాక్కుని వెళుతుంది. "దేని కోసం మ‌ద‌న‌ప‌డుతున్నావో దానికి ప‌రిష్కారం దొరికిందిరా" అంటుంది. ఇంత‌కీ డాక్ట‌ర్ బాబు తల్లి సౌంద‌ర్య చెప్పిన మాట‌లు విన్నాడా? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది ఈ రోజు ఎపిసోడ్‌లో చూడాల్సిందే.