English | Telugu

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

నన్ను తాతయ్య దగ్గరికి పంపించాలని ఎవరు అన్నారని శౌర్య అనగానే శౌర్య అందరి వంక చూస్తుంది. నేను అనుకున్నాను.. ఎందుకు అంటే ముద్దుల తాతయ్యకి తన భార్య ఉంది. సుమిత్ర అమ్మమ్మ తాతయ్య ఒక దగ్గర ఉన్నారు.. మీరు ఒక దగ్గర ఉండాలి కదా.. నాకు తాతయ్యతో ఆడుకోవాలని ఉంటుంది కదా అని శౌర్య అనగానే శౌర్య దగ్గరికి తీసుకొని నీకు ఆడుకోవాలనిపిస్తే చెప్పు మీ నాన్నతో పిలిపిస్తానని కాంచన అంటుంది. మనం చెయ్యలేని పనిని మన కూతురు చేసిందని కార్తీక్ , దీప అనుకుంటారు. మరొకవైపు శ్రీధర్ మాట్లాడుతుంటే కాశీ పట్టుంచుకోడు. అప్పుడే స్వప్నని పిలిచి నీ భర్తకి నా దగ్గర పని చెయ్యడం ఇష్టం లేదని అంటాడు. డాడీతో కలిసి ఉంటే చాలా నేర్చుకుంటావ్.. దాంతో మనం సొంతగా రెస్టారెంట్ కూడా పెట్టొచ్చని స్వప్న అనగానే ఇక ఏం చెయ్యలేక నాకు మావయ్య దగ్గర పని చెయ్యడం ఇష్టమే అంటాడు.

మరొకవైపు దశరథ్ శత్రువు అయిన వైరా దగ్గరికి జ్యోత్స్న వచ్చి ఇప్పుడున్న సీఈఓ ప్లేస్ లో నేను ఉండాలి. ఈ కాశీని వాడుకోండి అని జ్యోత్స్న, వైరాకీ కాశీ ఫోటో పంపిస్తుంది. జ్యోత్స్న, వైరా ఇద్దరు డీలింగ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఈ రోజు జ్యోత్స్న తో మాట్లాడడానికి కాశీ తన గదికి వెళ్ళాడని కార్తీక్ తో దీప చెప్తుంది. పారుని కలవడానికి వెళ్లి ఉంటాడని కార్తీక్ చెప్తాడు. కానీ కార్తీక్ మనసులో ఎందుకు వెళ్ళాడన్న డౌట్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.