English | Telugu

‘సర్కార్’ కి హోస్ట్‌గా సుడిగాలి సుధీర్

నిరంతరం వినోదంతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న ఈ ఓటీటీ తన సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో సర్కార్ సీజన్ 4తో సందడి చేయటానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా అలరించబోతున్నారు. మునుపెన్నడూ లేనంత పెద్దగా, గొప్పగా, మనలో ఆసక్తిని మరింత పెంచేదిగా ఈ రియాలిటీ గేమ్ షో ఉండనుంది.

సుడిగాలి సుధీర్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నసంగతి తెలిసిందే. ఆకట్టుకునే లుక్స్, ఏదైనా విషయాన్ని వెంటనే గ్రహించే తెలివితేటలతో కార్యక్రమాలను హోస్ట్ చేయటంలో సుధీర్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు సర్కార్ సీజన్ 4తో ప్రేక్షకులను మెప్పించటానికి, టీవీలకు అతుక్కుపోయేలా చేయటానికి సిద్ధంగా ఉన్నారు.

సర్కార్ సీజన్ 3 వరకు ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రానా, సాయి పల్లవి, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్, శ్రీవిష్ణు, ప్రియమణి వంటి అతిథులు హాజరు కావటం కూడా కార్యక్రమానికి సరికొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. ఇప్పుడు సీజన్ 4 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నాలుగో సీజన్ ఎప్పుటి నుంచి ఉంటుందా? పాల్గొనబోయే అతిథులు ఎవరు అనే వివరాలు అందరిలోనూ ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి.

ఆహా రియాలిటీ షో జోనర్‌లో కొత్త విధానంతో ఆకట్టుకుంది. అందులో భాగంగానే సర్కార్ రియాలిటీ గేమ్ షో కొత్త ట్విస్టులు, ఛాలెంజ్‌లతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలో సర్కార్ సీజన్ 4తో ఆహా ఈ ఏడాది తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. సరికొత్త ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని అందించటంలో ఏమాత్రం వెనుకడుగు వేయదు.

సర్కార్ సీజన్ 4లో సాహసయాత్రను ప్రారంభించటానికి సిద్ధంగా ఉండండి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి... అది కూడా ఎక్స్‌క్లూజివ్‌గా ఆహా ఓటీటీలో మాత్రమే.