English | Telugu
అరవై ఏళ్ల బామ్మలతో సుడిగాలి సుధీర్ డాన్స్.. రచ్చ రచ్చే!
Updated : Apr 28, 2021
ఈటీవీలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కామెడీ షోని ప్రసారం చేస్తున్నారు. మొదట్లో కొందరు కమెడియన్లను, సీరియల్ నటులను యాంకర్లుగా పెట్టి వ్యూస్ రాబట్టాలని ప్రయత్నించారు. అయితే కంటెంట్ ఆకట్టుకోకపోవడంతో షోకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో నిర్వాహకులు 'జబర్దస్త్' కమెడియన్లను రంగంలోకి దింపారు. హోస్ట్ గా సుడిగాలి సుధీర్ కి బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కామెడీ షోకి క్రేజ్ దక్కింది. ఇప్పుడు రామ్ ప్రసాద్, వర్ష, బిగ్ బాస్ హిమజ, ఇమ్మాన్యుయేల్, పొట్టి నరేష్ వీళ్లంతా కూడా ఈ షోలో తమ స్కిట్ లతో అలరిస్తున్నారు.
తాజాగా ఈ షోకి సంబందించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్.. 'ఎంటర్టైన్మెంట్ బిగిన్స్' అంటూ అరవై ఏళ్ల బామ్మలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో 'లాహే.. లాహే' అనే పాటకి వీళ్లంతా కలిసి చేసిన డాన్స్ మాములుగా లేదు. ఇది కదా గ్రేస్ అంటే.. ఇది కదా డాన్స్ అంటే అంటూ సుధీర్ వారితో పోటీ పడి మరీ డాన్స్ వేశాడు. డాన్స్ కి వయసు అడ్డం కాదని ఈ బామ్మలు నిరూపించారు.
మొన్నామధ్య ఓ టీవీ షో కోసం నటి రేఖ కూడా స్టేజ్ మీద డాన్స్ వేసింది. ఆమె వయసు కూడా అరవైకి పైగానే ఉంటుంది. ఇప్పుడు అదే వయసులో ఉన్న కొందరు మహిళలు కూడా డాన్స్ చేసి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. మొత్తానికి సుధీర్ రాకతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. ఇక టీఆర్ఫీ కూడా ఓ రేంజ్ లో వస్తుందని అంచనా వేస్తున్నారు.