English | Telugu
త్వరలో దీప్తి-షన్ను పెళ్లి?
Updated : Apr 28, 2021
సూపర్ హిట్ మూవీ సాంగ్స్‌కు కవర్ సాంగ్స్ చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ పెయిర్. డాన్స్ వీడియోలు కూడా వారికి మంచి ఆదరణ తెచ్చాయి. వారిది క్యూట్ పెయిర్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. దీప్తి సునయన ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనగా, బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నాడంటూ బలంగా ప్రచారం జరుగుతోంది.
ఆ ఇద్దరూ డేటింగ్‌లో ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కొంత కాలం క్రితం వారిద్దరికీ బ్రేకప్ అయ్యిందనే వదంతులు కూడా సోషల్ మీడియాలో షికారు చేశాయి. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఆ ఇద్దరూ తాము ఆఫ్ స్క్రీన్ కపుల్ అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. పైగా ఆ ఇద్దరూ చేతిపై ఒకే రమైన టాటూలు వేయించుకొని తమ మధ్య ప్రేమను బయటపెట్టారు.
లేటెస్ట్‌గా వీరి అనుబంధంపై వెబ్ సిరీస్ యాక్టర్ సూర్యస్వామి స్పందిస్తూ, ఇంకో రెండేళ్లలో వారిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడంతో, ఆ ఇద్దరూ సీరియస్‌గా లవ్‌లో ఉన్నారని అర్థమైంది. సూర్యస్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విరివిగా వ్యాప్తిలోకి వచ్చాయి. త్వరలోనే దీప్తి-షన్ను పెళ్లి చేసుకోనున్నారంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. షన్ను ప్రస్తుతం సూర్య అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.