English | Telugu
అనుతో ఆర్యకు చెక్ పెట్టిన రాగసుధ
Updated : Jun 3, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సీరియల్ అనుక్షణం ఉత్కంఠభరిత మలుపులతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంతోంది. ఇందులో `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, రామ్ జగన్, జయలలిత, జ్యోతిరెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, అనుష సంతోష్, రాధాకృష్ణ, మధుశ్రీ, సందీప్, ఉమాదేవి తదితరులు నటించారు. అర్థ్రాంతరంగా చనిపోయిన ఓ యువతి మర్దర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథగా ఈ సీరియల్ ఉత్కఠభరిత మలుపులతో సాగుతోంది.
ఆర్యవర్ధన్ ని ఎలాగైనా లాక్ చేయాలని ప్రయత్నిస్తున్న రాగసుధ అందుకు అనుని పావుగా వాడుకోవాలని ఫిక్సవుతుంది. ఆర్య వర్థన్.. రాజనందినిని హత్య చేస్తున్నట్టు.. అందుకు రాజనందిని ఆర్యని వద్దంటూ వారిస్తున్నట్టు క్రియేట్ చేసిన ఓ వీడియోని పెన్ డ్రైవ్ లో కి ఎక్కించి దాన్ని పోలీసులకు అను చేత అప్పగించేలా ప్లాన్ చేస్తుంది. పథకం ప్రకారం అనుని నమ్మించి పెన్ డ్రైవ్ ని తీసుకుని పోలీస్టేషన్ లో అడుగుపెడుతుంది. దీంతో రాగసుధ చెప్పినట్టుగానే అను పెన్ డ్రైవ్ ని సీఐకి అప్పగించి దీని ఆధారంగా కేసు ఫైల్ చేయమంటుంది.
అయితే ఆర్య వర్ధన్ కుటుంబ పరువుకు సంబంధించిన వ్యవహారమని, అంత త్వరగా కేసు ఫైల్ చేయలేమని ఆయనని సంప్రదించాకే కేసు ఫైల్ చేస్తామని సీఐ చెబుతాడు. దీంతో అలర్ట్ అయిన రాగసుధ... స్వయంగా ఆర్యవర్ధన్ వైఫ్ చెబుతుంటే మళ్లీ ఆర్యవర్ధన్ ని సంప్రదించడం ఏంటని చెప్పి అనుకు సైగ చేస్తుంది. దాంతో అనుమానంగానే అను నేను చెబుతున్నాను కదా కేసు ఫైల్ చేయండి సర్ అని చెబుతుంది. దీంతో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న సీఐ ఎక్కడో లాజిక్ మిస్సవుతోందంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో మళ్లీ అలెర్ట్ అయిన రాగసుధ లేట్ చేసే కొద్దీ హంతకుడు అలెర్ట్ అయ్యే అవకాశం వుందని అనుతో చెప్పిస్తుంది. దీంతో సరే అంటూ కంప్లైంట్ తీసుకుంటాడు.
కట్ చేస్తే.. ఆర్య ఆఫీసుతో పోలీసులు ఎంట్రీ ఇస్తారు. నేరుగా ఆర్య క్యాబిన్ లోకి వెళ్లడంతో జెండే అభ్యంతరం చెబుతాడు. సీఐ బలమైన ఆధారాలతో వచ్చామని, కేసు పెట్టారు కాబట్టే వచ్చామని చెబుతాడు. దీంతో ఆర్యపై కేసు పెట్టింది ఎవరని జెండే నిలదీస్తాడు.. ఆర్యవర్ధన్ వైఫ్ అనునే కేసు పెట్టిందని సీఐ చెప్పడంతో ఆర్య, జెండే ఒక్కసారిగా షాక్ అవుతారు. అదే సమయంలో అను ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆర్యవర్ధన్ ని పోలీసులు అరెస్ట్ చేశారా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.