English | Telugu
ఎపిసోడ్ కి గ్యాప్ ఉంటుందేమో మా ఎనెర్జీకి కాదు..ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి బేరాల్లేవ్
Updated : Dec 10, 2022
"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఫన్నీఫన్నీగా అలరిస్తోంది. ఈ వారం థర్డ్ రౌండ్ "ఇచ్చి పడేస్తాం" లో స్టాక్స్ అంతా కల్లు తగిన కోతుల్లా ప్రవర్తించాలి అంటే మెంటల్ వాళ్ళలా మారి అల్లరి చేస్తుంటే వాళ్ళను కంట్రోల్ చేయడానికి డాక్టర్ గా సుడిగాలి సుధీర్ రావాలని టాస్క్ ఇచ్చారు చైర్మన్ అనిల్ రవి రావిపూడి. ఇక ఈ రౌండ్ లో స్టాక్స్ అంతా గ్రీన్ డ్రెస్ వేసుకొచ్చి ఎంటర్టైన్ చేశారు. వేణు కామెడీ వేరే లెవెల్లో ఉంది. అలా ఆ మెంటల్ పేషేంట్స్ కి ఇచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలని చెప్పడంతో వేణు అందరినీ పిలిచి ఇదిగో.. టాబ్లెట్స్ వేసుకునే టైం అయ్యింది..అందరూ ఈ టైం మీద టాబ్లెట్స్ వేసేయండి అని చెప్పాడు. పది సంవత్సరాల క్రితం చనిపోయిన నాన్నను డబ్బు సంపాదించి బతికించుకోవాలని చెప్పి కామెడీ చేసారు. ఇక డాక్టర్ గా వచ్చిన సుధీర్ ని వీళ్లంతా ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. వేణు టేప్ పట్టుకుని స్కిట్ ఎంత ఉందో కొలుస్తూ ఎనిమిది నిమిషాలు వచ్చింది ఇక అందరూ చచ్చిపోవాలి అని కింద పడిపోయారు.
స్కిట్ ఎయిట్ మినిట్స్ ఓకే కానీ అందులో కామెడీ ఉండాలి కదా అని సుధీర్ అనేసరికి అందులో కామెడీని నేనే మాయం చేసేశానుగా అని సద్దాం కామెడీ చేసాడు. ఇక ఈ వారం చిల్లెస్ట్ పెర్ఫార్మర్ గా యాదమ్మ రాజు నిలవగా , లాఫింగ్ స్టాక్ ఆఫ్ ది డేగా వేణు నిలిచాడు. అలా ఈ వారం ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. ఫైనల్ గా "ఎపిసోడ్ కి గ్యాప్ ఉంటుందేమో మా ఎనెర్జీకి గ్యాప్ ఉండదు" అని సుధీర్ చెప్పేసరికి "ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి బేరాలు లేవమ్మా" అని చైర్మన్ సర్ చెప్పి మార్కెట్ ని క్లోజ్ చేసేసారు.