English | Telugu

ఈ వారం ఇనయా ఎలిమినేషన్ నిజమేనా!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా, ఈ సండే ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే ప్రతీ సీజన్ బిగ్ బాస్ ఫినాలేకి ఐదుగురు మాత్రమే వెళ్తారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పటికే ఇనయా ఎలిమినేషన్ అంటూ వార్త చక్కర్లు కొడుతుంది.

అయితే బిగ్ బాస్ ఈ ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేసి, మిడ్ వీక్ ఎలిమినేట్ గా మరొక కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఈ వారమే డబుల్ ఎలిమినేషన్ చేసి అందరికి ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు వీక్షకులు. అయితే ఈ వారం జరిగిన గోస్ట్ టాస్క్ లో అందరు బాగా పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారో అని ఉత్కంఠ అందరిలోను ఉంది.

అయితే శ్రీహాన్ ఫినాలేకి వెళ్ళిన విషయం తెలిసిందే. కాబట్టి అతను ఎలిమినేషన్స్ లో లేడు. మిగతావాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటింగ్ పోల్స్ బట్టి రేవంత్ మొదట స్థానంలో ఉండగా, రోహిత్ రెండు, ఇనయా మూడు, ఆదిరెడ్డి నాల్గవ స్థానాలలో ఉన్నారు. కాగా అందరి కన్నా లీస్ట్ లో శ్రీసత్య ఉండగా, స్వల్ప ఓట్ల ఆధిక్యతతో కీర్తి ఉంది. అయితే అంచనాలు తారు మారు చేస్తూ బిగ్ బాస్ తన వర్షన్ లో ఎలిమినేషన్ ప్రక్రియను చేస్తాడేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.