English | Telugu
బాస్ ఈజ్ బ్యాక్... సుధీర్ గుడెలపై వాలిపోయిన రష్మీ!
Updated : Aug 11, 2023
బుల్లితెర మీద ఫేమస్ ఐన రీల్ జోడి ఎవరు అంటే చాలు రష్మీ, సుధీర్ అని చెప్తారు. వీళ్ళు షోలో కనిపించారంటే చాలు ఆడియన్స్ లో ఆనందం ఉప్పొంగుతుంది. కొంతకాలం వీళ్ళిద్దరూ కలిసి షోస్ చేశారు తర్వాత సుధీర్ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు...రష్మీ మాత్రం హ్యాపీగా బుల్లితెర మీద, అవకాశం వచ్చినప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఐతే వీళ్ళ మధ్య గ్యాప్ ని మాత్రం ఆడియన్స్ భరించలేకపోతున్నారు. అలాగే బుల్లితెర మీద వీళ్ళ గ్యాప్ ని ఫుల్ గా కాష్ కూడా చేసుకుంటూ కౌంటర్లు కూడా వేస్తున్నారు.
ఇప్పుడు ఈటీవీ 28 ఇయర్స్ బలగం సెలెబ్రేషన్స్ పేరుతో ఒక ఈవెంట్ ని టెలికాస్ట్ కాబోతోంది. అందులో మళ్ళీ రష్మీ, సుధీర్ కలిసి డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేసేసరికి ఆడియన్స్ ఆనందం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఈ ప్రోమో సుధీర్ - రష్మీ డైలాగ్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. “మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు ” అని సుధీర్ అనగానే “ మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను” అంటూ రష్మి బుంగమూతి పెట్టుకుని చిరు కోపం ప్రదర్శిస్తూ ఆన్సర్ ఇచ్చింది. "ఇన్ని రోజులు ఎక్కడున్నావ్" అని మళ్ళీ రష్మీనే అడిగేసరికి .. “నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లో ఉన్నావ్” అని సుధీర్ చెప్పిన ఆ ఒక్క డైలాగ్ తో స్టేజి మొత్తం నవ్వులు పూశాయి. సుధీర్- రష్మీ ప్రేమ ఏమో కానీ వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటే చూడాలని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఐతే సోషల్ మీడియా మాత్రం వీళ్లకు పెళ్లి కూడా చేసేసింది. వీళ్ళ పెళ్లి వీడియోస్ చూసుకుని వీళ్ళు కూడా నవ్వుకున్నారు. ఐతే సుధీర్- రష్మీ మధ్య ప్రేమ గీమా లాంటిదేమీ లేదంటూ గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో సుధీర్ ఫ్రెండ్స్ రాంప్రసాద్, గెటప్ శీను చెప్పారు.