English | Telugu
బిగ్ బాస్ 7 లో రచ్చకి రెడీ అంటున్న ఆర్జీవీ అప్సర!
Updated : Aug 10, 2023
బిగ్ బాస్ అంటే చాలా మందికి గుర్తొచ్చేవి హౌస్ లో జరిగే గేమ్స్, ఫుడ్, మంచి వెదర్, బిగ్ బాస్ మాటలు అన్నీ గుర్తొస్తాయి. బిగ్ బాస్ తెలుగు ఇప్పటివరకు 6 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. త్వరలో అంటే ఈ నెలాఖరుకు కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ బిగ్ బాస్ సీజన్ 7 రాబోతోంది. ఐతే ఈ బిగ్ బాస్ సీజన్స్ లో కచ్చితంగా ఒక ఆర్జీవీ హీరోయిన్ ఉంటోంది. ఐతే ఇప్పటి వరకు ఉన్న ఆర్జీవీ హీరోయిన్స్ ని ఒకసారి పరిశీలిస్తే బిగ్ బాస్ సీజన్ 3 లో అష్షు రెడ్డి వెళ్ళింది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షు ఆర్జీవీ పెద్ద ఫ్యాన్. డేంజరస్ మూవీ ప్రొమోషన్స్ ని ఆర్జీవీ, అష్షు ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. అష్షు రెడ్డి ఇప్పటి వరకూ తాను కలిసిన వాళ్లలో నిజాయితీగల అమ్మాయి అంటూ ఆర్జీవీ కూడా ఒక పోస్ట్ పెట్టారు. ఇకపొతే ఆరియానా.. ఈమె ఆర్జీవిని బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మరీ పేరు తెచ్చుకుంది. తనకు అరియానా బాడీ ఎంతో బాగా నచ్చింది అని కూడా చెప్పి… ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆర్జీవీ.
ఆరియానా బిగ్ బాస్ సీజన్ 4 లో సందడి చేసింది. మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీటర్ గా మారిపోయింది. ఆరియానాకు ఆర్జీవీ అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పింది. రామ్ గోపాల్ వర్మని ఒక మాడ్రన్ ఋషి. ఆయన గురించి మనకేం తెలుసు ఆయన మన మధ్య ఉన్న ఋషి అంటూ పొగిడేసింది. ఇకపోతే ఇనాయ సుల్తానా..ఈమె కూడా ఆర్జీవీ హీరోయిన్... ఈమె బిగ్ బాస్ సీజన్ 6 లో సందడి చేసింది. చాలామందితో ప్రేమాయణాలు నడిపింది. ఒక ప్రైవేట్ పార్టీలో ఆర్జీవీతో కలిసి డాన్స్ చేసిన ఇనాయ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఆమె వెళ్ళింది సరే బయట ఉన్న ఆర్జీవీ ఆమెను గెలిపించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టాడు. మరి వీళ్లంతా ఆర్జీవీతో ఇంటర్వ్యూస్ చేసి, ప్రైవేట్ పార్టీస్ లో డాన్సస్ చేసి ఆర్జీవీ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్నారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 కి ఎవరు వెళ్ళబోతున్నారనే ప్రశ్న వేస్తున్నారు ఆడియన్స్ ...ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో కలిసి పని చేసిన అప్సర రాణి ఉంది. మరి చూడాలి ఎవరు వెళ్తారో అని.