English | Telugu

సుధాచంద్రన్ కోసం పాట పాడిన పార్వతి..చంద్రముఖి డాన్స్ వేసిన రోహిణి!

డాన్స్ ఇండియా డాన్స్ షో నెమ్మదిగా సెలబ్రిటీస్ రాకతో ఒక మోస్తరు రేటింగ్ పెంచుకుంటూ వెళ్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ కి మయూరి మూవీ హీరోయిన్ సుధా చంద్రన్ వచ్చి డాన్స్ చేసి స్టేజిని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక ఎపిసోడ్ నిర్వాహకులు ఒక అట్ట మీద ఆమె పాద ముద్రలు వేయించి భద్రపరిచారు. తర్వాత సింగర్ పార్వతి స్టేజి మీదకు వచ్చి ఆమెను చూసి మాట్లాడలేకపోయింది.

సుధాచంద్రన్ గారికి పాదాభివందనం చేసి మిమ్మల్ని ఇంత దగ్గర చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు మేడం..దేవుడా నా జన్మ ధన్యమైపోయింది. పుస్తకాల్లో మీ గురించి చదివేటప్పుడు ఎవరామె, నేను కలుస్తానా ఎప్పుడైనా అనుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ తిరుపతికి వచ్చి క్లాసికల్ డాన్స్ వేసి మిమ్మల్ని కలిసినట్లుగా ఫొటోస్ చూపించేసరికి నేను ఎప్పుడు కలుస్తానా అనుకునేదాన్ని.

కానీ ఈ రోజు ఈ షో ద్వారా ఆ అవకాశం వచ్చింది అని పార్వతి అనేసరికి సుధాచంద్రన్ మాట్లాడుతూ నేను నీ పాటకు పెద్ద ఫ్యాన్ ని అందుకే నీ గెలుపు కోసం చాలా ఓట్లు వేసాను" కానీ ఇప్పుడు నా కోసం ఒక పాట పాడాలి అనేసరికి "ఊరంతా చీకటి" సాంగ్ పాడింది పార్వతి. ఇక రోహిణి చంద్రముఖి డాన్స్ తో ఆమెను భయపెట్టేసింది.

ఇక ఫైనల్ గా జడ్జెస్ కి కంటెస్టెంట్స్ అందరికి " ఐ లవ్ యు అని చెప్పి ఈ షో రాక్ చేస్తూనే ఉంటుంది..మీరు డాన్స్ మంచిగా పెర్ఫార్మ్ చేయండి అని బ్లెస్సింగ్స్" ఇచ్చారు సుధా.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..