English | Telugu
'నేను మంత్రిని కావడం మీకు ఇష్టం లేదా?'.. ఏడ్చేసిన రోజా!
Updated : Oct 6, 2022
దసరా పండగని పురస్కరించుకుని దసరా వైభవం పేరుతో ఈటీవీ ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ షోకి మంత్రి రోజా గెస్ట్ గా వచ్చారు. రోజా ప్రస్థానం ఎక్కడినుంచి మొదలయ్యింది అనే అన్ని విషయాలను యోధ అనే కంటెస్టెంట్ స్కిట్ కమ్ డాన్స్ రూపంలో వేసి చూపించింది. తర్వాత టీం మొత్తం కలిసి రోజాకు సన్మానం చేశారు.ఆ తర్వాతే అనుకోనిది జరిగింది.
తర్వాత జబర్దస్త్ కి, కమెడియన్స్ కి సంబంధించి కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు రోజా. ఐతే తన ఆరోగ్యం మంచిగా ఉండడానికి కారణం డాక్టర్ చెప్పిన టిప్స్ అనేసరికి, నూకరాజు లైన్ లోకి వచ్చి "ఏంటి మేడం ఇంత కామెడీగా మాట్లాడుతున్నారు.. ఇంతకు ముందు మీరు ఏం అన్నారో ఒకసారి వీడియో చూడండి" అంటూ ఒక ఓల్డ్ ఫుటేజ్ ని ప్లే చేసి చూపించాడు. అందులో "జబర్దస్త్ వల్లనే నేను ఇంత హెల్తీగా ఉన్నాను" అని అప్పట్లో చెప్పారు రోజా.
దాన్ని చూసి "అప్పుడు అది నా ఫీలింగ్" అని ఆమె అన్నారు. "మరి జబర్దస్త్ అంటే నాకు ఇష్టం, మీరంతా నా ఫామిలీ అని చెప్పారు.మంత్రి పదవి వచ్చేసరికి జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. అంటే మీరు జబర్దస్త్ గురించి చెప్పింది నిజం అనుకోవాలా? లేదంటే మంత్రి కాగానే వెళ్ళిపోయింది నిజమనుకోవాలా?" అని నూకరాజు అడిగాడు. "అవును మీరంతా నాకు ఇష్టం.. ఇందులో తప్పేముంది" అని రోజా జవాబిచ్చారు.
"అదే మేడం నూకరాజు అడిగేది.. 'మీ సక్సెస్ లో జబర్దస్త్ ఉంది కానీ జబర్దస్త్ లో మీరు లేరు' అని అడిగాడు అంతే" అంటూ ఆది కవర్ చేయబోయాడు. "ఏమిటి అందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి పిలిచింది అవమానించడానికా?" అంటూ పూల దండ విసిరేసి ఏడ్చేశారు రోజా.
"నేను జబర్దస్త్ ని చాలా మిస్ అవుతున్నా. ఇప్పుడు ఈ షోకి చాలా ధైర్యం చేసి వచ్చాను. మీరే చెప్పండి నేను మంత్రిని కావడం మీకు ఇష్టం లేదా?" అని రోజా అడిగేసరికి "మీరు మంత్రి కావడం మీ అదృష్టం.. మీరు జబర్దస్త్ లో లేకపోవడం మా దురదృష్టం" అన్నాడు ఆది.
"మీకు నన్ను చూడాలనిపిస్తే మా ఇంటికి రండి, లేదా వీలు చూసుకుని నేను వస్తాను, ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ లో కలుద్దాం. అంతేగాని ఎప్పుడూ ఇలా బాధపెట్టొద్దు" అనేసరికి నూకరాజు రోజాకి సారీ చెప్పాడు. ఇక ఫైనల్ గా అందరూ విందు భోజనాలు చేశారు. రోజా దగ్గరుండి అందరికీ వడ్డించి స్టేజి మీద ఉన్న అందరికీ ముద్దలు కలిపి పెట్టింది. ఇలా ఈ వారం దసరా వైభవం స్పెషల్ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.