English | Telugu

ట్రెండింగ్ లో   7 Days Of Love వెబ్ సిరీస్!

యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న తెలుగు వెబ్ సిరీస్ 7 Days of Love... ప్రవళిక దామెర్ల, అర్జున్ కళ్యాణ్ లీడ్ రోల్స్ లో చేసిన ఈ సిరీస్ యూత్ ని ఆకర్షించేలా తీసాడు డైరెక్టర్ హేమ సాయి. అభి పాత్రలో ఆర్జే సూర్య నటించగా, ప్రియ పాత్రలో లోక్షిత నటించింది. హేమ సాయి రాసుకున్న ఈ కథని తనే డైరెక్ట్ చేశాడు.

అభి(ఆర్జే సూర్య) ఒక డబ్బున్న కుర్రాడు. అతనితో వర్ష(ప్రవళిక) లవ్ లో ఉంటుంది. అయితే కొన్ని రోజులుగా అభి, వర్ష(ప్రవళిక) నుండి కిస్, రొమాన్స్ కావలనుకుంటున్నాడని గ్రహించిన వర్ష(ప్రవళిక).. ఒకరోజు తనని కిస్ చేయడానికి చూసిన అభి చెంపమీద కొట్టేస్తుంది. అభికి తనమీద ఉంది ప్రేమ కాదని అది వేరే అని తెలుసుకున్న వర్షకి మగాళ్ళంటేనే అసూయ, కోపం కలుగుతాయి. దాంతో రోడ్డు మీద బాల్ కోసం వచ్చిన వంశీ(అర్జున్ కళ్యాణ్) ని తిట్టేస్తుంది. అయితే అంతకముందు నుండి వర్షని వన్ సైడ్ నుండి లవ్ చేస్తుంటాడు వంశీ. వర్ష కోపంగా ఉండటం గమనించిన వంశీ.. అదేంటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ ప్రియకి కాల్ చేస్తాడు. వర్ష, ప్రియ(లోక్షిత) తో కలిసి ఒకే రూమ్ లో ఉంటారు. దాంతో ప్రియని రిక్వెస్ట్ చేస్తాడు వంశీ‌. ప్రియ కూడా తన రిక్వెస్ట్ ని వర్షతో చెప్పి, ఇతని ప్రేమను చూడు చాలు, నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదని చెప్పి కన్విన్స్ చేస్తుంది. ఆ తర్వాత వర్ష, వంశీతో కలిసి ఉండటానికి ఒప్పుకుంటుంది. అయితే తను ఏడు రోజుల్లో అమెరికా వెళ్తున్నట్లుగా చెప్తుంది. కావాలంటే ఈ వారం రోజుల్లో లవ్ చేసుకో అని వర్ష చెప్పడంతో వంశీ షాక్ అవుతాడు. మరి ఆ ఏడు రోజుల్లో ఏం జరిగింది? వర్షని వంశీ లవ్ లో పడేలా చేశాడా? లేదా తెలియాలంటే యూట్యూబ్ లోని ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే.

ఇన్ఫినిటమ్ మీడియా ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ సిరీస్ కి బండారు వందన నిర్మాత. కాగా ఈ సిరీస్ లోని కొన్ని డైలాగ్స్ యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఎప్పుడు ఒక ఫ్రెష్ లవ్ స్టోరీలను చూడాలనుకునేవారు ఈ సిరీస్ ని చూసేయొచ్చు. ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్‌ లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు ఉంది. క్యారెక్టర్స్ మధ్య కథ కొత్తగా సాగుతుంది. మ్యూజిక్ కూడా బాగుంది. డైలాగ్స్ ఈ వెబ్ సిరీస్ కి ఆయువుపట్టుగా నిలిచాయి‌. " ఈ సొసైటీ ఎప్పుడు ఏ విషయాన్ని అయినా ఒక సైడ్ నుండే డిసైడ్ చేసేస్తుంది", " రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఈ రోజే ఫుల్ గా ఎంజాయ్ చేయాలి" లాంటి డైలాగ్స్ అందరికి బాగా కనెక్ట్ అవుతాయి.