English | Telugu

రథం ముగ్గేస్తే అది కాస్తా మణికొండ వరకు వెళ్లిందట...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముందుగా శ్రీముఖి ముంజెకాయల్ని ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ అంతా కూడా వాటిని తిన్నారు. "మీరందరూ తింటుంటే ఎంత అందంగా ఉంది ఒక్కడు తింటుంటే మాత్రం అచ్చం పండు కోతిలెక్క ఉన్నావ్రా " అంటూ శ్రీముఖి, రోహిణి కలిసి ఇమ్మానుయేల్ ని కామెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ ని విలేజ్ థీమ్ తో డిజైన్ చేసారు. చిన్నప్పుడు పల్లెటూరిలో అందరూ చేసిన అల్లరిని సెట్ లో బుల్లితెర నటులంతా కలిసి చేశారన్నమాట. ఐతే అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక్కడ ఎవరికీ ముగ్గులు వేయడం వచ్చో జెన్యూన్ గా వచ్చో చేతులెత్తండి అనేసరికి అమరదీప్ చెయ్యెత్తాడు. "తేజు చెప్పింది నీ ముగ్గుల గురించి..మొన్న రథం ముగ్గు వేసావంట...అది కూడా మణికొండ వరకు వెళ్లిందట.." అనేసరికి అమరదీప్ తో పాటు అందరూ నవ్వేశారు.

తర్వాత అమ్మాయిలకు అబ్బాయిలకు ముగ్గుల పోటీ పెట్టింది. బాయ్స్ అండ్ గర్ల్స్ వేసిన రెండు ముగ్గులు చూసిన జడ్జ్ అనసూయ ఐతే కళ్లద్దాలు పెట్టుకున్నాక ఈ ముగ్గులా ఉంది కళ్లద్దాలు తీసేసాక ఆ ముగ్గులా ఉంది అంటూ సెటైర్ వేసింది. తర్వాత ఒక టబ్ లో కొన్ని చేపల్ని తెప్పించింది శ్రీముఖి. "మీకు తెలిసిన కొన్ని చేపల రకాలు చెప్పండి" అంటూ ఖిలాడీ గర్ల్స్ ని అడిగింది. "పిత్తబరిగె, శీలావతి " అని డెబ్జానీ చెప్పింది. తర్వాత ఇంద్రావతి అని రోహిణి చెప్పేసరికి..అదేం చేప అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది. తర్వాత ఇమ్మానుయేల్ ఒక టబ్బులో నాట్లు వేసే టాస్క్ చేసాడు. అలాగే ప్రియాంక జైన్ - అమరదీప్ కలిసి ఏడు పెంకులాట టాస్క్ ఆడారు. ఐతే అందులో బాల్ తేవడానికి మెట్ల వంటి సెటప్ చేశారు. ఐతే అందులో అమరదీప్ కాలు ఇరుక్కుపోయింది. దాంతో అనసూయ అందరూ "ఓ మై గాడ్" అంటూ షాక్ అయ్యారు. మరి ఇంతకు ఏమయ్యిందో షోలో చూడాలి.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.