English | Telugu

నా లిప్స్ ఇష్టం అన్నాడు.. అంతవరకే జరిగింది...ఆ తర్వాతేమీ జరగలేదు


బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి తెలియని వారు లేరు. అలాగే శివ్ ఉన్న స్నేహం గురించి కూడా తెలుసు. ఏ షోకి వెళ్లినా ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తారు. అలాగే ప్రియాంక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "ఒక పర్సన్ మన లైఫ్ పార్టనర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి" అని యాంకర్ అడిగేసరికి శివ్ లా ఉండాలి అని చెప్పింది. అలాగే శివ్ కి ఫోన్ చేయించి ఐ లవ్ యు చెప్పించింది. శివ్ కూడా రివర్స్ లో ఐ లవ్ యు చెప్పాడు. వెంటనే పరి "వీడు ముసలోడు అవ్వకూడదు" అనే డైలాగ్ చెప్పింది. "కాండిల్ లైట్ డిన్నర్ , బ్లాక్ బ్లాక్ డ్రెస్ నాకే కాదు అందరి డ్రీం కూడా అదే ఉంటుంది.

శివ్ ఎప్పుడైనా బ్లాక్ డ్రెస్ వేసాడంటే చాలు నేను అలా చూస్తూ ఉండిపోతా....ఆ రోజు శివ్ నా లిప్స్ అంటే ఇష్టం అని చెప్పాడు. అంత వరకే జరిగింది...ఆ తర్వాతేమీ జరగలేదు." కొంటెగా చెప్పి నవ్వేసింది ప్రియాంక. ఇక అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారు ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాం అని హింట్ ఇచ్చింది ప్రియాంక. రీసెంట్ గా ప్రియాంక ఇష్మార్ట్ జోడి షోకి వలల డ్రెస్ ఒకటి వేసుకురావడంతో ఆమె మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. "కొన్ని కామెంట్స్ చూస్తే నాకే అసహ్యమనిపించింది. నేను ఈ కామెంట్స్ ఎందుకు చూస్తున్నానా అనిపించింది. ఇలాంటి డ్రెస్ ని నేను షోలో వేసుకున్నాను...అదే వేసుకుని మాల్ లో తిరగలేను కదా...ఒక అమ్మాయిగా ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుస్తుంది కదా...మేము మనుషులమే..మాకు కన్నీళ్లు ఉంటాయి...మేము బాడ్ గా ఫీలవుతాము. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు మేము దీని కోసం కాదు చేసింది..మాకు ఆస్తులలాంటివి ఏమీ లేవు...కష్టాల గురించి ఆలోచిస్తే గూస్ బంప్స్ వస్తాయి" అనిపిస్తుంది అని చెప్పింది ప్రియాంక.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.