English | Telugu

విశాల్ చూస్తుండ‌గానే భూష‌ణ్ పై తిలోత్త‌మ దాడి!


చందూ గౌడ‌, అషికా గోపాల్ జంట‌గా న‌టించిన సీరియ‌ల్ `త్రిన‌య‌ని`. గ‌త కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ట్విస్ట్ లు, ట‌ర్న్ ల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, ద్వారకేష్ నాయుడు, అనిల్ చౌద‌రి, ప్రియాంకా చౌద‌రి, విష్ణు ప్రియ‌, భావ‌నా రెడ్డి, శ్రీ‌స‌త్య‌, సురేష్ చంద్ర‌, జ‌య‌ల‌లిత‌, చ‌ల్లా చందు త‌దిత‌రులు న‌టించారు. సూప‌ర్ నేచుర‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంటోంది.

గురువారం ఎపిసోడ్ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం. భూష‌ణ్ ఎక్క‌డున్నాడో తెలుసుకోవాల‌ని బ‌స్తీలోకి ఎంట్రీ ఇచ్చిన విశాల్ త‌న‌ని వెతుకుతూ గ‌ల్లీ గ‌ల్లీ గాలిస్తుంటాడు. ఇదే స‌మ‌యంలో భూష‌ణ్ త‌మ‌కే క‌నిపించాల‌ని తిలోత్త‌మ‌, క‌సి, వ‌ల్ల‌భ మారు వేషాల్లో వెతుక‌డం మొద‌లు పెడ‌తారు. ఇదే స‌మ‌యంలో న‌య‌ని కూడా బ‌స్తీలోకి ప్ర‌వేశిస్తుంది. భూష‌ణ్ విశాల్ కి కానీ, తిలోత్త‌మ బ్యాచ్ కి గానీ దొరక్కూడ‌ద‌ని న‌య‌ని వెత‌క‌డం మొద‌లు పెడుతుంది.

ఈ క్ర‌మంలో భూష‌ణ్ ని వెతుకుతున్నార‌ని అత‌ని భార్య‌కు తెలియ‌డంతో అక్క‌డి నుంచి పారిపోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అయితే ఓ పోల్ ప‌క్క‌న కూర్చున్న భూష‌ణ్ ..తిలోత్త‌మ కంటప‌డ‌తాడు. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలింద‌ని భావించిన తిలోత్త‌మ ప‌క్క‌నే వున్న ఐర‌న్ రాడ్ తో భూష‌ణ్ ని హ‌త్య చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. తిలోత్త‌మ ..భూష‌ణ్ పై దాడి చేస్తున్న దృశ్యాల‌ని విశాల్ క‌ళ్లారా చూస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? భూష‌ణ్ ని తిలోత్త‌మ హ‌త్య చేసిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.