English | Telugu

తగ్గేదేలే అంటోన్న రేవంత్!


బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ అనగానే అర్థ‌మైపోయే విషయం ఏంటంటే 'నామినేషన్స్'. ఇందులో జరిగే హైడ్రామా ఏ పోటీ లో కూడాజరుగదు అన్నట్టుగా కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. అయితే నామినేషన్లో అత్యధిక ఓట్లు వచ్చింది రేవంత్ కి. హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది రేవంత్ కి నామినేట్ చేసినా తగ్గేదేలే అని అన్నాడు రేవంత్.

అయితే నామినేషన్ ప్రకియ మొదలవ్వగానే రేవంత్ ని నామినేట్ చేసింది శ్రీసత్య. కారణం ఏంటి అని అడుగగా, "నువ్వు గేమ్ జరుగుతున్నప్పుడు రెండు సార్లు పడుకున్నావ్, దాని వల్ల హౌస్ బ్యాటరీ రీఛార్జ్ అనేది తగ్గిపోయింది. అది తగ్గిపోకుంటే వేరేవాళ్ళకు ఛాన్స్ వచ్చేది" అని శ్రీసత్య చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, "నేను పడుకున్నది.. అది నా తప్పే ఒప్పుకుంటాను. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఒక పది శాతం ఛార్జ్ మాత్రమే తీసుకొన్నాను. ఎందుకంటే నా తర్వాత వేరేవాళ్ళకి ఛాన్స్ రావాలని, ఇట్స్ ఓకే ఫైన్" అని రేవంత్ వెళ్ళిపోయాడు.

తర్వాత శ్రీసత్య వచ్చి రేవంత్ ని నామినేట్ చేసింది. నెక్ట్స్‌ వచ్చిన ఆదిత్య కూడా తననే నామినేట్ చేసాడు. చివరగా కెప్టెన్ సూర్య కూడా నామినేట్ చేయగా, "ఎవ్వరైనా కానీ ఏది అయినా కానీ నీ అవ్వ తగ్గేదేలే" అని రేవంత్, 'పుష్ప' మూవీలోని 'అల్లు అర్జున్' లా నడుచుకుంటూ వచ్చేసాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..