English | Telugu

'చమ్కీల లొల్లి'లో శ్రీహాన్, ఇనయా! ఇద్ద‌రూ త‌గ్గ‌ట్లే!!


నామినేషన్ అనగానే మొదటగా గుర్తొచ్చే రెండు పేర్లు శ్రీహాన్, ఇనయా. ఎందుకంటే వీళ్ళిద్దరు మొదటి వారం నుండి ఒకరి మీద ఒకరు నామినేషన్ వేసుకుంటూ వ‌స్తున్నారు. శ్రీహాన్ తన నామినేషన్ ప్రకియలో భాగంగా ఫస్ట్ నామినేషన్ ఇనయా అని మొదలుపెట్టాడు. కారణం చెబుతూ, "హ హ నువ్వు లయర్ వి అని అన్నావ్. ఆ రోజు టాస్క్ లో మేం గెలిచిన తర్వాత అలా అన్నావ్.. అది నాకు నచ్చలేదు" అని శ్రీహాన్ చెప్పగా, "సిల్లీ రీజన్ కి నామినేట్ చేసావ్, వన్ మినిట్ కూడా ఏం పర్ఫామెన్స్ ఇవ్వలేదు. నువ్వు ఏం పీకావ్ అస్సలు" అంటూ ఫైర్ ఐంది ఇనయా.

"నీ గురించి చెప్పడానికి నాకు చాలా పాయింట్లు ఉన్నాయి" అని శ్రీహాన్ అనగా, "అసలు పాయింట్ ఉంటే కదా చెప్పడానికి" అని ఇనయా అంది. ఇనయా తన నామినేషన్ ని శ్రీహాన్ కి వేసి మాట్లాడుతూ, "సోఫాలో నా చమ్కీలు పడ్డాయి. అది డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చు కదా, హౌస్ లో అందరికి చెబుతూ, దాన్ని లాగి లాగి ఇక్కడి దాకా తీసుకొచ్చావ్. నాకు డైరెక్ట్ చెబితే నేను చేస్తా కదా" అంది ఇన‌యా.

"నేను చెబితే నువ్వు వింటావా? అయిన నేను నీకు ఎందుకు చెప్తాను. కెప్టెన్ కి చెబుతాను. అది ఎవరితో చెప్పుకోవాలనేది నా ఇష్టం. నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ.. చెప్పేది విను. గట్టిగా మాట్లాడితే కాదు. అయినా నువ్వు నన్ను 'ఏం పీకావ్' అంటే తప్పు లేదు కానీ నేను నిన్ను 'ఏ' అంటే తప్పు అనిపించిందా?" అని అడిగాడు శ్రీ‌హాన్‌.