English | Telugu
ఫలించని ఇనయా ఒంటరి పోరాటం..కొత్త కెప్టెన్ గా శ్రీసత్య!
Updated : Nov 5, 2022
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి వరకు కెప్టెన్ గా శ్రీహాన్ ఉన్నాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ రేస్ లో 'కీర్తి భట్, శ్రీసత్య, వసంతి, ఫైమా, మెరీనా, ఇనయా, గీతు' ఉండగా బెలూన్స్ టాస్క్ లో శ్రీసత్య గెలిచి, కొత్త కెప్టెన్ గా ఎన్నుకోబడింది.
అసలు ఏం జరిగిందంటే మిషన్ ఇంపాజిబుల్ గేమ్ తర్వాత బెలూన్ పగులగొట్టడానికి ఒక్కో టీం నుండి ముగ్గురు వచ్చారు. టాస్క్ ఏంటంటే, "ప్రతీ ఒక్కరి దగ్గర ఒక్కో బెలూన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోను, ఈ బెలూన్ పగిలిపోకూడదు. కిందపడిపోకూడదు" అని బిగ్ బాస్ నియమాలను పోటీదారులకు వివరించాడు. ఆ తర్వాత గేమ్ మొదలైంది. కానీ ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేపోయారు. "మీరు బజర్ మోగే లోపు గేమ్ ముగించకపోతే టాస్క్ ఆగిపోతుంది. తర్వాత వారం మొత్తానికి కెప్టెన్ ఎవరు ఉండరు" అని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ చేసాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ పోటాపోటీగా ఆడారు. అందరి బెలూన్స్ పగిలిపోగా, చివరకు ఇనయా, శ్రీసత్య ఉన్నారు.
అయితే ఇనయాను అందరు టార్గెట్ చేసారు. శ్రీసత్య బెలూన్ పగులగొట్టకుండా, ఇనయా బెలూన్ పగులగొట్టారు. ఇది చూసిన ప్రతీ ఒక్కరికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. శ్రీసత్య గెలవడం అనేది ఒక చీటింగ్ అని అన్ ఫేయిర్ గేమ్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇనయాకి మద్దతుగా నిలబడలేకపోవడం అనేది మొత్తంగా అన్ ఫేయిర్ గా అనిపిస్తోంది. ఇనయా బాగా పర్ఫామెన్స్ చేసినా కూడా హౌస్ మేట్స్ సపోర్ట్ లేకుండా ఒక్కరిగా పోరాటం చేయడం వల్ల గెలవడం అసాధారణమని మరోసారి తెలిసింది.
కాగా ఇనయా ఒంటరి పోరాటం వృధా అయింది. ఆ తర్వాత శ్రీసత్య విజేతగా నిలిచి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంది. కాగా మిగిలిన హౌస్ మేట్స్ అందరు అభినందనలు తెలిపారు. "మన హౌస్ లో పెరుగు లేదు.. సత్యకి తిరుగులేదు" అని ఫైమా చెప్పగా, "దొండకాయ..బెండకాయ సత్య నా బెండకాయ" అని గీతు ఫన్నీగా అంది. అలా కొత్త కెప్టెన్ గా శ్రీసత్య ఎన్నికైంది. ఇక మునుముందు హౌస్ లో కొత్త కెప్టెన్ గా తన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుందో చూడాలి మరి.