English | Telugu
పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి ఫ్యాషన్ షో!
Updated : Feb 12, 2021
బుల్లితెర యాంకర్స్ ఒకరిని మించి ఒకరు అందాల ప్రదర్శనకు పోటీపడుతున్నట్టుగాన్నారు. ఇటీవల వర్షిణి సౌందరరాజన్ హాట్ హాట్ డ్రెస్సుల్లో అందాల విందుకు పోటీపడితే .. `పోరా పోవే` ఫేమ్ బుల్లితెర యాంకరమ్మ విష్ణు ప్రియ కూడా షర్ట్ బటన్స్ విప్పేసి షార్ట్ నిక్కర్‌లో దర్శనమిచ్చి కాకపుట్టించింది.విష్ణు ప్రియ హాట్ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఇక ఇటీవల గోవా బీచ్‌లో చిట్టిపొట్టి గౌనులో వాటర్ బేబీగా మారిన శ్రీముఖి తడిసిన అందాలని ఆరబోస్తూ గోవా తీరంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. పేపర్ గౌను వేసుకుని థై షో చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఫోల్డింగ్ ఐరన్ చైర్‌పై కూర్చుని అందాల విందు చేస్తూ ఫొటోలకు పోజులిచ్చిన స్టిల్స్ ప్రస్తుతం ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి.
అన్నట్టు ఈ ప్రేమికుల రోజున గ్రేట్ న్యూస్‌ని చెప్పబోతోందట. ఆ వార్తని ప్రకటించడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తన ఫొటోషూట్ ఫొటోలతో పాటు షేర్ చేసింది. ఆ వార్త ఏంటీ? ఎవరినైనా ప్రేమించిందా? ప‌్రేమికుల రోజునే గ్రేట్ న్యూస్‌ని వినిపిస్తానని ఎందుకు అంటోందన్నది అర్థం కావడం లేదని శ్రీముఖి ఫ్యాన్స్ తలబాదుకుంటున్నారు.