English | Telugu
ముద్దుల్తో శ్యామలని ముంచెత్తాడు!
Updated : Feb 12, 2021
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తోంది శ్యామల. కొన్ని చిత్రాల్లో నటిగా కూడా రాణించిన శ్యామల ప్రస్తుతం సినిమా కార్యక్రమాలతో పాటు పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా సొంతంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌ని కూడా ప్రారంభించింది. దీని పేరే వెరైటీగా ప్లాన్ చేసింది. శ్యామల తన యూట్యూబ్ ఛానల్ పేరుని 'ఏం చెప్పారు శ్యామలగారు'అని పెట్టేసింది.
టీవీ నటుడితో ప్రేమలోపడిన శ్యామల అతన్నే వివాహం చేసుకుంది. ఇటీవలే తన వైవాహిక జీవిత పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.ఈ సందర్భంగా శ్యామల పంచుకున్న ఓ వీడియో ఇప్పడు నెట్టింట సందడి చేస్తోంది. పదవ వివాహ వేడుకని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న శ్యామల ఇందు కోసం ప్రత్యేకంగా ఓ వీడియోనుఅభిమానుల కోసం పంచుకోవాలని ప్రయత్నించింది.
ఈ వీడియోలో శ్యామల భర్త నరసింహ ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. వీడియో షూట్ మొదలైందని తెలిసినా శ్యామలని ఆపకుండా ముద్దుల్లో ముంచేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ సీజన్ 2లోనూ సందడి చేసిన శ్యామల ప్రస్తుతం మరింత పాపులారిటీని దక్కించుకుని యమ బిజీగా మారడం విశేషం.