English | Telugu
కార్తీక్ చేతికి ప్రూఫ్స్.. దీప లైన్ క్లియర్!
Updated : Feb 13, 2021
'కార్తీక దీపం' సీరియల్ ఈ శనివారం సరికొత్త మలుపు తిరగబోతోంది. శౌర్యతో కలిసి వంటగదిలో కింద కూర్చుని కార్తీక్ అన్నం తినడం చూసిన సౌందర్య, ఆనందరావు ఫ్యామిలీ ఒక్కసారిగా అవాక్కవుతారు. ఎంతలో ఎంత మార్పు అనుకుంటారు. కార్తీక్ తింటూ ఇంట్లో వాళ్లపై సెటైర్లు వేస్తున్న తీరుకు ఆశ్చర్యపోయిన ఇంటివారు ఆ తంతుని సైలెంట్‌గా చూస్తుండిపోతారు.
కట్ చేస్తే కార్తీక్‌ని అనవసరంగా మాటలన్నానని మోనిత ఫీలవుతూ వుంటుంది. ఎలాగైనా అతనని తన దగ్గరికి తెచ్చుకోవాలని, ఆలోచిస్తూ వుంటుంది. "నేను చెప్పిందంతా కార్తీక్ విని సైలెంట్‌గా వెళ్లాడంటే నేను చెప్పింది కరెక్టే అని ఆలోచిస్తున్నాడనే కదా అర్థం. సో తను నన్ను అపార్థం చేసుకునే అవకాశం లేనట్టే. కాకపోతే కార్తీక్ తన దగ్గర శౌర్య వుందని చెప్పాడు. దానివన్నీ దీప బుద్దులే.. సందు చూసుకుని కార్తీక్ మనసుని మార్చి తనతో పాటు దీప దగ్గరికి తీసుకెళ్లినా తీసుకెళుతుంది. అంత చావు తెలివితేటలున్నాయి దానికి. వీలైనంత త్వరగా శౌర్యని పంపించేయాలి." అని మోనిత తనలో తానే మాట్లాడుకుంటుంది.
కట్ చేస్తే కార్తీక్ కోర్టు విషయం గురించి మాట్లాడుతుంటాడు. "కోర్టు ఇద్దరినీ ఇస్తానంటే ఇద్దరినీ తీసుకుందాం" అంటాడు. "వాళ్లిద్దరినీ తీసుకుంటే నేనేందుకు?" అంటూ పిచ్చిపట్టిన దానిలా నవ్వుతుంది మోనిత.. ఇంకోవైపు.. "ఏంటే ఇది.. కోర్టు నోటీసు చదివావా?.. ఇంత నిబ్బరంగా వున్నావేంటే?" అంటుంది సౌందర్య దీపని. "నిబ్బరంగా ఎందుకు లేను శుబ్బరంగా ఇద్దరం కోర్టుకు వెళదాం" అంటుంది దీప. "జరిగేవన్నీ చూస్తూ పిచ్చిపట్టి మాట్లాడుతున్నావే" అంటుంది సౌందర్య.. ఇదే సమయంలో కార్తీక్ చేతికి అసలు ప్రూఫ్స్ వచ్చి చేరతాయి.. దీంతో దీప లైన్ క్లియర్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో పూర్తిగా చూడాలంటే స్టార్ మాలో 'కార్తీక దీపం' చూడాల్సిందే.