English | Telugu
జబర్దస్త్ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత? అనసూయని మరిపిస్తుందా?
Updated : Nov 8, 2022
'జబర్దస్త్' ఎంతోమందిని లైంలైట్ లోకి తీసుకొచ్చేసరికి ఇలాంటి షోలోకి ఎలాగైనా రావాలని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇక యాంకర్‌గా రావాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే జబర్దస్త్ షో యాంకర్స్‌గా చేసిన అనసూయ, రష్మీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఊహించని రేంజ్‌కి వెళ్లిపోయారు. మూవీస్‌లో చిన్న రోల్స్ చేసే రష్మీ హీరోయిన్ అయ్యింది.
అలాగే అనసూయ కూడా మూవీస్‌లో మంచి రోల్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తోంది. అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకున్నాక ఆ పోస్ట్ కోసం చాలా మంది ట్రై చేశారు. 'రెమ్యునరేషన్ తక్కువైనా కూడా చేసేస్తాం' అని హింట్ కూడా ఇచ్చారు. ఇక ఏమయ్యిందో కానీ 'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్‌గా ఉన్న రష్మికే జబర్దస్త్ బాధ్యతలు అప్పగించారు. ఎట్టకేలకు సౌమ్య రావు అనే కన్నడ సీరియల్ నటిని అనసూయ ప్లేస్ లోకి తీసుకొచ్చారు. ఈ గురువారం ఎపిసోడ్ నుండి సౌమ్య రావు జబర్దస్త్ యాంకర్‌గా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే విడుదల అయ్యింది. రష్మీనే కొనసాగిస్తే బెటర్ అని కొందరు అంటుండగా, ఎట్టకేలకు జబర్దస్త్‌లో కొత్త యాంకర్‌ని చూసే అవకాశం దక్కిందని మరికొందరు ఫీల్ అవుతున్నారు.
కాగా ఈ కొత్త యాంకర్‌కి రెమ్యూనరేషన్ ఎంత? వంటి ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి. సౌమ్య రావు రెమ్యూనరేషన్ ఎపిసోడ్‌కి రూ.1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఫిక్స్ చేశారట. రష్మీ ఒక ఎపిసోడ్ కి రూ. 2 లక్షలు పైనే తీసుకుంటున్నారని సమాచారం. ఇక జబర్దస్త్ వంటి కామెడీ షోలో యాంకర్ పాత్ర చాలా ఎక్కువ. ఆడియన్స్‌కి మంచిగా రీచ్ కాకపొతే మాత్రం కామెంట్స్‌తో ఆడేసుకుంటారు. ఇక ఇప్పుడు ఈ కొత్త యాంకర్‌పై అనసూయను మరపించాల్సిన పెద్ద బాధ్యతే ఉంది.