English | Telugu
సోనియా కన్నింగ్.. నిఖిల్ కెప్టెన్సీ ఫైట్!
Updated : Sep 21, 2024
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. ఆయితే మొన్నటి దాకా ఫుడ్ కోసం టాస్క్ లు అవ్వగా.. నిన్నటి నుండి కొత్త కెప్టెన్ కోసం టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక రెడ్ ఎగ్ కోసం సోనియా కన్నింగ్ ప్లాన్ హౌస్ అందరికి అర్థమైంది.
హౌస్ లో ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి నిఖిల్, సోనియా, పృథ్వీ, అభయ్ మాట్లాడుకున్నారు. సోనియాను నిఖిల్ దగ్గరికి తీసుకొని.. సారీ అని చెప్తున్నా కదా.. ఇక నుంచి నువ్వు సిగరెట్ తాగద్దంటే తాగ.. దీనికి ముందు ఎప్పుడూ చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా సీరియస్‌గా అంటూ నిఖిల్ మాటిచ్చాడు. ఇక ఉదయం కాగానే "తిన్నావా నాన్న" అంటూ సోనియా దగ్గరికెళ్లాడు నిఖిల్. కానీ సోనియా తలతిక్కగా ఆన్సర్ ఇచ్చింది. "నాకు ఆకలేస్తే నేను తింటా.. నీకు అంతున్నప్పుడు నువ్వు తినేటప్పుడు అడగాల్సింది కదా.. ఇప్పుడెందుకు వచ్చినవ్ మరి అని సోనియా అంది. దీనికి నిఖిల్ కూడా స్ట్రాంగ్‌గానే ఆన్సర్ ఇచ్చాడు.. మరి అందరి ముందు అలా బిహేవ్ చేస్తే బాగోదు.. ఏదో అడిగినప్పుడు.. ఒక సిగరెట్ విషయానికి అందరి ముందు ముఖం తిప్పుకోవడమేంటి అంటూ నిఖిల్ అన్నాడు.
సిగరెట్ విషయం నా పాత గర్ల్ ఫ్రెండ్స్ ఎంతో మంది చెప్పినా నేను వదల్లేదు.. ఇప్పుడు సడెన్‌గా చెప్పి కంట్రోల్ చెయ్ అంటే నేనేం చేయాలి.. నువ్వు ఈరోజు కూడా సిగరెట్ తాగావ్ అంటే.. అదేంటి నేను సడెన్‌గా వదిలేయాలా.. రెస్ట్రిక్ట్ చేస్తున్నావా అన్నా.. ఇక సోనియాకే ఇస్తా రెడ్ ఎగ్.. చీఫ్ అవ్వని.. ఎట్టా కంట్రోల్ చేస్తుందో చూస్తా.. ఎందుకంటే దొబ్బుతా ఉంది మామా మెంటల్లీ.. నువ్వు నా మాట వినలేదు.. నేను మాట్లాడను నీతో.. కూర్చో, నిల్చో, తిను అనగానే చేసేయాలా. నా పర్సనల్ లైఫ్‌లో నేను ఎలా ఉండాలో అది జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా.. నువ్వు ఎందుకు ఇంటర్‌ఫియర్ అవుతావ్.. నా పర్సనల్ లైఫ్‌లో.. నేను ఏమైనా నీకు అలా చెప్తున్నానా.. అయినా నన్ను ఒకరు కంట్రోల్ చేయడానికి చూస్తే నచ్చదు నాకు అంటూ తన ఫ్రస్ట్రేషన్ అంతా నిఖిల్ చెప్పుకున్నాడు.
ఇక కాసేపటికీ అభయ్ దగ్గర సోనియా కూడా తన వెర్షన్ చెప్పింది. నాకు బేసిక్‌గా మాట్లాడాలని లేదురా వాడితో ఒకటి రెండు రోజులు.. కాకపోతే వాడు బాగా ప్రెజర్ ఫీల్ అయితే మాట్లాడతా అంతే.. వాడి డెసిషన్ మేకింగ్ చాలా వీక్.. అలాంటి వాడి నీడ కూడా నాపై పడకూడదు.. నాకు కోపం వస్తా ఉంటుందని సోనియా అంది. ఇది జరిగిన కాసేపటికే అందరూ ఉండగా నిఖిల్ దగ్గరికెళ్లి స్లోగా.. రేయ్ అందరి ముందు అట్లన్నందుకు సారీరా నీకు ఇబ్బంది అయింది కదా.. అని సోనియా సారీ చెప్పింది. మొత్తానికి నిఖిల్ ని గ్రిప్ లో పెట్టుకుంటుంది సోనియా.