English | Telugu

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్ట్ కార్డ్ ఎంట్రీ...ముగ్గురి లో ఎవరు?


బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే మూడు వారాలు అవుతోంది. ‌కానీ హౌస్ లో సరైన ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు లేకపోవడంతో ఇది అంతగా ఇంట్రెస్టింగ్ గా లేదని బిబి టీమ్ వైల్ట్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి వారిలో ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈసారి హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లతో పాట గత ఏడు సీజన్లలో ఆల్‌రెడీ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారంట. ఇందులో ముగ్గురు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. అందులో మొదటగా జబర్దస్త్ రోహిణి అని తెలుస్తోంది. గతంలో బిగ్‌బాస్ సీజన్ 3 లో రోహిణి మెరిసింది. టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్‌లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అందులో ఈసారి సీజన్‌లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నంలో బిబి టీమ్ ఉందని తెలుస్తోంది.

మరొకరు అవినాష్ అని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్‌లోకి రాబోతున్నాడని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్‌ను పంపేందుకు ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయిందట. అవినాష్ కూడా తన కామెడీతో బాగానే లాక్కొస్తాడు. ఇక బిగ్‌బాస్ సీజన్ 1 లో దుమ్ముదులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి తీసుకొస్తున్నారంట. ఇక వీరితో పాటు రీతు చౌదరి ఫ్రెండ్ గోరింటాక్ సీరియల్ ఫేమ్ కావ్య కూడా హౌస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మీరెవరు వస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.