English | Telugu

బిగ్ బాస్ ని తిట్టిన అభయ్...బొక్కలో ట్విస్ట్ లు నువ్వు!


బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్ల కోసం కంటెస్టెంట్స్ పిచ్చి పిచ్చిగా గొడవలు, కొట్లాట, ఏడ్వడాలు, హగ్గులు ఇలా అన్నీ ముగిసాయి. ఎట్టకేలకు ఈ గుడ్ల టాస్క్ ముగిసింది. ‌ఇందులో ఎవరు గెలిచారో ఓసారి చూద్దాం..

ప్రభావతి 2.0 టాస్క్ లో కాంతారా(అభి) మీద అత్యధిక పాయింట్లతో శక్తి (నిఖిల్) టీమ్ విజయం సాధించింది. ఇక ఇది పూర్తైన వెంటనే కాంతార టీమ్ చీఫ్ అభయ్ తన క్లాన్ సభ్యులకి ధైర్యం చెప్పే పనిలో పడ్డాడు. ఈ గేమ్‌కి ఏ ఎఫెక్ట్ అయిన అది నేను బ్లేమ్ తీసుకుంటా.. మీకు ఎవరికైనా పర్సనల్‌గా హర్ట్ అయితే ఐ యామ్ సారీ.. నేను అయితే అలా ఆడలేనంటూ అభయ్ చెప్పాడు. ఇక ఈ గేమ్‌లో సోనియా కన్నింగ్ బ్రెయిన్ గురించి యష్మీ కామెంట్స్ చేసింది. టీమ్ అంతా ట్రిగర్ అయ్యేటట్లు మాట్లాడతది.. ఎంత చీప్ ట్రిక్స్ వాడుతదని యష్మీ ఫైర్ అయింది. అన్నా (అభయ్) సోనియాతో 10 ఇయర్స్ ఫ్రెండ్ షిప్ ఎలా చేశారన్నా మీరు అంటూ ప్రేరణ అడిగింది. దాంతో అభయ్ నవ్వుకున్నాడు. సోనియా-అభయ్ బయటి నుంచే ఫ్రెండ్స్ అన్న విషయం ఆడియన్స్‌కి ఇలా తెలిసింది.

ఇక తర్వాత రూమ్‌లోకి వెళ్ళాక కూడా బిగ్‌బాస్‌ను తిట్టాడు అభయ్. బిగ్‌బాస్ కాదు నువ్వు బయాస్‌డ్ (పక్షపాతం) బాస్.. నేను మాట్లాడింది కట్ చేస్తారేమో కానీ నేను బయటకెళ్లాక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా.. నిజంగా ధమాక్ లేదు నీకు.. ఒకడికి రూల్ ఇచ్చి ఇంకొకడి ఇవ్వకుండా.. ఇదేం పనికిమాలిన గేమ్‌ నాకు అర్థం కాలేదు.. నిద్రపోయిండా.. లేక గతం ఏమైనా మర్చిపోయిండా.. బొక్కలో ట్విస్ట్‌లు నువ్వు.. లిమిట్ లెస్ బయాస్‌డ్ బిగ్‌బాస్.. అంటూ అభయ్ తిట్టాడు. ఇక పద్మావతి టాస్కులో గెలవడంతో నిఖిల్‌కి డైరెక్ట్‌గా టీమ్‌కి చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఓడిపోయినందుకు కాంతార టీమ్ చీఫ్ పదవి నుంచి అభయ్‌ను పీకేశాడు బిగ్‌బాస్. తర్వాత రెడ్ ఎగ్ ఎవరిదగ్గర ఉందని అడగ్గా మా టీమ్ దగ్గరే అంటూ నిఖిల్ సమాధానమిచ్చాడు.

దీంతో ఆ రెడ్ ఎగ్ ఎవరిదగ్గర ఉంటే వాళ్లు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని పొందుతారు. దీంతో ఆ రెడ్ ఎగ్‌ను మీ టీమ్‌లో ఎవరికిచ్చి కంటెండర్‌గా వాళ్లతో తలపడదామనుకుంటున్నారో చెప్పండి అంటూ నిఖిల్‌కి చెప్పాడు బిగ్‌బాస్. మరోవైపు అభయ్‌ను చీఫ్‌గా తొలగించాక.. మిగిలిన టీమ్ సభ్యులు మీలో మీరు చర్చించుకొని క్లాన్ చీఫ్ కంటెండర్లు అయ్యేందుకు ముగ్గురిని సెలక్ట్ చేసుకోండి అంటూ కాంతార టీమ్‌కి చెప్పాడు బిగ్‌బాస్.

ఇక ఆ తర్వాత కొత్త కంటెండర్ కోసం నిఖిల్, సోనియాకి మధ్య నిదానమే ప్రధానమే అంటూ ఓ టాస్క్ ఇవ్వగా.. సోమియా మీద నిఖిల్ గెలిచాడు. ఛీఫ్ గా మరోసారి నిఖిల్ ఎన్నికయ్యాడు. ఇలా నిఖిల్ గెలవగానే యష్మీ పరిగెత్తుకొచ్చి నిఖిల్ బుగ్గమీద ఓ కిస్ ఇచ్చింది. సోనియా అయితే పైకి చెప్పలేదు కానీ పక్కకెళ్లి గట్టిగానే ఫీల్ అయింది. మరోవైపు విష్ణుప్రియ, నైనికలతో నిఖిల్ ఓ డైలాగ్ కొట్టాడు. అందరు ఏమనుకున్నారంటే గుడ్డు ఇచ్చి కావాలని ఓడిపోతాననుకున్నారు.. కానీ నా పర్సనాలిటీ ఉంది కదా.. అవకాశం ఇచ్చా.. వదులుకుంటే అది మీ ఇష్టమంటు నిఖిల్ అన్నాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.