English | Telugu
పల్లవి ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే విజేత.. శోభాశెట్టి సెన్సేషనల్ కామెంట్స్!
Updated : Dec 12, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో గత వారం రోజులుగా ఎన్నో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ దత్తపుత్రిక శోభాశెట్టిని ఎలిమినేట్ చేయరని అనుకున్నారంతా కానీ అందరికి ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్, ప్రియాంక మిగిలారు. అర్జున్ గేమ్స్ లో గెలవడం వల్లే ఇప్పటిదాకా ఉన్నాడనేది వాస్తవం. లేదంటే అతని బిహేవియర్ కి ఎప్పుడో బయటకొచ్చేవాడు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేముందు.. నేను తెలియక మిమ్మల్ని ఏం అయిన అని ఉంటే నిజంగా క్షమించండి అంటు శివాజీ కాళ్ళమీద పడింది శోభాశెట్టి. అయితే ఎలిమినేషన్ తర్వాత కొన్నిచోట్ల తన ఫ్యాన్స్ మీట్ అయ్యారు. అందులో కొందరు. ఎప్పుడో బయటకు రావాల్సింది. ఇప్పుడు వచ్చావంటూ కామెంట్ చేయగా శోభాశెట్టి అలియాస్ మోనిత ముఖం వాడిపోయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కొన్ని రోజులు రెస్ట్ కావాలి. జనరల్ గా అయితే బెంగుళూరుకు వెళ్ళాలి కానీ ఫినాలే ఉంది కదా అని అంది. హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారని ఒకరు అడుగగా.. నాకేం తెలియదు. ఫినాలే వీక్ కదా, ఎవరేం మాట్లాడుతున్నారో? బయటకు ఎలా ప్రొజెక్ట్ అయిందో తెలియదని అసలేం గుర్తులేదని శోభాశెట్టి అంది. టైటిల్ విన్నర్ ఎవరని మీరనుకుంటున్నారని అడుగగా.. నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే లోపల ఒకలా ఉంటుంది. బయట టీవీలో ఒకలా కన్పిస్తుందని అంది. బయట ఉన్న బజ్ ప్రకారం అమర్, ప్రశాంత్, శివాజీలలో ఒకరే టైటిల్ గెలుస్తారని అంటున్నారని ఒకరు అడుగగా.. అయ్యయ్యో అమర్ దీపా వాడెప్పపుడు ఫౌల్ గేమ్సే ఆడతాడు. వాడికి అంత లేదు. అయితే ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే అని శోభాశెట్టి అంది.
భోలే షావలితో నామినేషన్ లో జరిగిన గొడవ మీకేమైనా నెగెటివ్ అవుతుందని అనుకున్నారా అని అడుగగా. అసలు అనుకోలేదని శోభా అంది. మోనితలాగా వాయిస్ పెద్దగా చేసి మాట్లాడటం వల్ల మీరు మరింత బ్యాడ్ అయ్యారని అనుకుంటున్నారా అని అడుగగా.. లేదంటి. అసలెప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక అబ్బాయికి స్టాండ్ తీసుకున్నాను. అందుకే అంత గట్టిగా మాట్లాడాను. అబ్బాయి అయిన అమ్మాయి అయిన మాట్లాడొచ్చు ఎందుకంటే హౌస్ లో జెండర్ ఢఫరెన్స్ లేదు. శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నారని అనిపించిందా అని అడుగగా.. అని బిగ్ బాస్ హౌస్ అక్కడ స్ట్రాటజీ, మైండ్ గేమ్ అన్నీ ఉండాలి లేదంటే మనం ఉండలేం అక్కడ అని శోభా అంది. ఇక ఫైనల్ గా ఎవరికి మీ సపోర్ట్ అని అనగా.. అర్జున్, ప్రియాంకకి నా సపోర్ట్ అని శోభా అంది.