English | Telugu
అమర్ దీప్ ఇలాంటివాడని అనుకోలేదు.. శోభాశెట్టి బయటపెట్టిన నిజాలు!
Updated : Dec 11, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో అతి ఎక్కువ మందికి తెలిసిన కంటెస్టెంట్ శోభాశెట్టి. ఎందుకంటే తన ఆటతీరుతో మాటతీరుతో ప్రేక్షకులకి పిచ్చెక్కించింది. శోభాశెట్టి సంఛాలక్ అంటే చాలు ఆ టాస్క్ మొత్తం గొడవలే అన్నంతగా మారిపోయింది సీన్. ఒక పాములగా పగపట్టి కాటేస్తుందని అశ్విని అన్నట్టుగా.. ఎవరితోనైన గొడవపడితే చాలు నామినేషన్ లో ఆ గొడవ జరిగిన అవతలి వ్యక్తి ఉండాల్సిందే. శివాజీని టార్గెట్ చేస్తూ చేసిన ప్రతీ మాట తన ఎలిమినేషన్ లో ముఖ్య పాత్ర వహించాయి.
ఇక బిబి బజ్ ఫుల్ ఇంటర్వ్యూ వచ్చేసింది. ఇందులో గీతు అడిగే ప్రశ్నలన్నింటిలో కొన్నింటికి మాత్రమే సమాధానాలని చెప్పింది. మీరు గ్రూప్ గా కలిసి నామినేషన్ చేశారా అని అడుగగా.. మేం ఒక్కసారి కూడా గ్రూప్ గా ఆడలేదని, మేం ఫ్రెండ్స్ అని శోభా అంది. దాంతో శివాజీ, ప్రశాంత్, యావర్ లని నామినేషన్ పెట్టాలని తేజని పిలిచి చెప్పిన వీడియో ఒకటి, సింక్ అండ్ ఫ్లోట్ టాస్క్ లో అమర్ దీప్ కి హెల్ప్ చేసిన వీడియో ప్లే చేసి చూపించి ఇది గ్రూపిజం కాదా అని అడుగగా.. కాదు మేం ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకున్నామని శోభా అంది. తేజ నువ్వు వెళ్ళిపోతే నేను హౌస్ లో ఉండలేనని అన్నావ్? అతను బయటకు వచ్చాక ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడుకోలేదని అడుగగా.. నేను తేజ కోసం బిగ్ బాస్ కి రాలేదంటూ సూటిగా చెప్పింది. " బడ్డీ టాస్కులో ప్రియాంక వల్లే మీరు ఓడిపోయారనే ఫీలింగ్ మీకు ఉంది కదా" అని అడుగగా.. మా మధ్య ఆ డిస్కషనే రాలేదని శోభా అంది. ప్రియాంక ఫీల్ అయిన వీడియో చూస్తారా అని గీతూ అడుగగా.. దీంతో బిగ్‌బాస్ డేస్ నా లైఫ్‌లో అయిపోయాయని శోభా అంది. ఇంకా అయిపోలేదు, బిగ్‌బాస్ బజ్ కూడా అయితేనే అయినట్లంటు కౌంటర్ వేసింది గీతు. ఇక అమర్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారు కదా మరి తను మీ గురించి ఏమన్నాడో చూడండి అంటూ ఓ వీడియో వేసింది చూపించింది. ఇందులో ప్రియాంకతో శోభా గురించి మాట్లాడుతూ.. తను బ్యాక్ బిచ్చింగ్ అని అమర్ అన్నాడు. ఈ వీడియో చూడగానే శోభా షాకైంది.
ఆ తర్వాత హౌస్‌మెట్స్ ఫొటోలు ఒక్కొక్కరివి చేత్తోనే ఇరగ్గొట్టేసి వారి గురించి చెప్పింది. శివాజీ ఫొటో పట్టుకొని "బిగ్‌బాస్ హౌస్‌లో నువ్వు నెగ్గుకు రావాలంటే శివాజీ సర్ ఆడుతున్న స్ట్రాటజీతో ఆడితే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవుతావ్" అంటూ శోభా చెప్పింది. ఇక ఇది విని సేఫ్ శోభా అని చెప్పేసరికి.. శోభాకి కోపం వచ్చేసింది. ఒక కొశ్చన్‌కి ఆన్సర్ లేకపోతే సింపుల్‌గా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని అంటారా అని గీతు అడుగగా.. బిగ్ బాస్ ముగిసిపోయింది. ఇక నేను మర్చిపోవాలనుకున్నా కానీ ఏదీ చెప్పనని శోభాశెట్టి అంది. " నా బెస్ట్ ఫ్రెండ్. తను బాగా ఆడుతుంది. నేను లేనే అని జెలస్ ఫీల్ అవుతున్నాను" అని ప్రియాంక ఫోటో చూపించి శోభా అంది. నాకు ఫౌల్ గేమ్ అనే పేరొచ్చిందే వీడివల్ల అంటు అమర్ దీప్ ఫోటోని చూపించింది. యావర్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువ, కోపం ఎక్కువ అని యావర్ గురించి చెప్పింది. అన్నా మల్లొచ్చినా.. ప్రశాంత్ ఇన్నోసెంట్ అని మనం అనుకుంటాం కానీ అతనికి అన్నీ తెలుసు. చాలా బ్యాలెన్స్ గా ఆడుతున్నాడు. చాలా స్టార్ట్ గా ఆడుతున్నాడని శోభా అంది.